ఏమంటా.. బిగ్ బాస్ కు వెళ్ళారో కాని ఓ రెండు జంటల మధ్య చిచ్చు రేగింది. రీసెంట్ గా షణ్ముఖ్ (Shanmukh )– దీప్తీ సునైనా(Deepthi Sunaina ) బ్రేకప్ చెప్పుకుంటున్న కొద్ది రోజులకే.. ఇటు సిరీ -శ్రీహాన్ లు కూడా బ్రేకప్ బాట పట్టబోతున్నట్టు తెలుస్తోంది. హౌస్ లో సిరీ-షణ్ణుల హగ్గులు..ముద్దులు గట్టి ప్రభావాన్నే చూపించాయి. మధ్యలో సిరీవాళ్ల అమ్మ వచ్చి హెచ్చరించినా.. మళ్లీ అదే రిపిట్ చేశారు. ఎమోషనల్ గా ఫీల్ అయినప్పుడల్లా.. సిరీ వెళ్లి షణ్ముఖ్ ను హత్తుకోవడం.. షణ్ముఖ్ – దీప్తీ సునైనాల మధ్య దూరం పెంచినట్టు తెలుస్తోంది. ఐదేళ్ళ బంధానికి రీసెంట్ గానే బ్రేకప్ చెప్పుకున్నారు యంగ్ లవ్ కపుల్. ఇప్పుడు సిరి- శ్రీహాన్ కూడా ఇదే బాట పట్టారని తెలుస్తోంది.