కుర్ర హీరోలతో రొమాన్స్ కు రెడీ అవుతున్న సీనియర్ స్టార్ హీరోయిన్లు..

స్టార్ సీనియర్ హీరోయిన్లు.. కుర్ర హీరోలతో జతకడుతున్నారు. నాలుగు పదుల వయస్సుకు దగ్గరగా ఉన్నవారు.. నలబై దాటిన హీరోయిన్లు తమకంటే వయస్సులో కాని.. స్టార్ డమ్ లో కాని చిన్న హీరోలతో ఆడిపాడటానికి రెడీ అయ్యారు..

స్టార్ సీనియర్ హీరోయిన్లు.. కుర్ర హీరోలతో జతకడుతున్నారు. నాలుగు పదుల వయస్సుకు దగ్గరగా ఉన్నవారు.. నలబై దాటిన హీరోయిన్లు తమకంటే వయస్సులో కాని.. స్టార్ డమ్ లో కాని చిన్న హీరోలతో ఆడిపాడటానికి రెడీ అయ్యారు.. ఇంతకీ చిన్న హీరోలతో సందడి చేయబోతున్న స్టార్ హీరోయిన్లు  ఎవరూ..

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోయిన్ అనుష్క(Anushka). స్టార్ హీరోలు.. సినియర్ హీరోల పక్కన హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన Anushkaకు రీసెంట్ గానే  నలబై ఏళ్లు వచ్చాయి. బాహుబలి తరువాత సినిమాలు తగ్గించింది స్టార్ హీరోయిన్.. 2021లో అనుష్క నుంచి ఒక్క సనిమా కూడా రాలేదు.  అయితే 2022లో మాత్రం యంగ్ హీరో జోడీగా రాబోతుంది. స్వీటీ స్టార్ డం ముందు, సీనియారిటీ ముందు నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty) ఇంకా చిన్నపిల్లాడే. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్నారు అంటూ..టాలీవుడ్‌లో కొన్నాళ్ల నుంచి డిస్కర్షన్స్ నడిచాయి.. వాటిని నిజం చేస్తూ ఈమధ్యే యువీ క్రియేషన్స్‌ క్లారిటీ ఇచ్చేసింది. ఈ ఇద్దరితో ఓ సినిమాను చేస్తున్నట్టు ప్రకటించేసింది. అందాల స్వీటీతో జాతిరత్నం కలిస్తే రచ్చ మామూలుగా ఉండదన్నమాటే. ఇక ఈ సినిమాను రారా కృష్ణయ్య’ఫేం మహేశ్‌బాబు  డైరెక్షన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. aa


డివోర్స్ తరువాత ఫుజ్ జోష్ చూపిస్తోంది సమంత(Samantha). 2022లో హవా గట్టిగా చూపించబోతుంది. సింగిల్ గా పాన్ ఇండియా సినిమాలను చేస్తోంది. ఎంత  విమెన్ సెంట్రీక్ సినిమాలు అయినా.. వాటిలో కూడా  సామ్ కు హీరోలు కావాలి కాబట్టి వాళ్లనీ సెట్ చేసుకుంటుంది. కాకపోతే తనకన్నా స్టార్ డం తక్కువున్న మలయాళీ యంగ్ స్టార్స్   ఆమె పక్కన కనిపించబోతున్నారు. శాకుంతలం సినిమాలో  దేవ్ మోహన్(Dev Mohan) నటించగా...సైన్స్ థ్రిల్లర్ యశోదలో ఉన్ని ముకుందన్(Unni Mukundan)ను ఫిక్స్ చేసారు. ఆల్రెడీ భాగమతి సినిమాలో అనుష్కకు జంటగా కనిపించిన ఉన్ని ముకుందన్.... ఇప్పుడు సామ్ సరసన చేస్తున్నాడు. గతంలో ఓ బేబి లో కూడా నాగశౌర్యతో ఇలాగే ఆడిపాడింది సమంతా.

బాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ గట్టిగానే నడుస్తుంది. ఈమధ్య యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేదితో హాట్ గా కనిపించింది దీపికా పదుకొనే(Deepika Padukone). బీచ్ దగ్గర కూర్చున్న వీరిద్దరి ఫోటోస్  వైరల్ గా మారాయి.  ఈ పిక్స్... బాలీవుడ్ న్యూ మూవీ గెహ్రయ్యాన్ సినిమాలోవి. ఇందులో దీపికా తనకంటే చిన్నవాడైన సిద్ధాంత్  కాంప్లికేషన్ రొమాన్స్ చేయబోతుంది. ఈ మూవీలో అనన్య పాండే కూడా నటిస్తోంది. . శకున్ బత్రా డైరెక్ట్ చేస్తున్నఈ ప్రాజెక్ట్ ని. అమెజాన్ ప్రైమ్ లో ఈనెల  25న  రిలీజ్ చేయబోతున్నారు.

రీసెంట్ గా తనకంటే ఐదేళ్ళు చిన్నవాడైన విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకుంది కత్రినా కైఫ్(Katrina Kaif). ఇక తనకంటే స్టార్ డమ్ లో…పోటీ పడలేని  విజయ్ సేతుపతి(Vijay Setupathi)తో నటిస్తోంది. మెర్రీ క్రిస్ మస్ పేరుతో రీసెంట్ గా నే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకెళ్లింది. విజయ్ సేతుపతికి స్టార్ డం లేదని కాదు కానీ ఇది బాలీవుడ్ మూవీ... అక్కడ సేతుపతి కంటే కత్రినానే ఫేమస్. బట్ వరుసగా బాలీవుడ్ ప్రాజెక్ట్ లకు సైన్ చేస్తున్న విజయ్ కి అక్కడా పేరు రావడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. అంధాధూన్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ వీళ్లిద్దరిని కలిపి సినిమా చేయబోతున్నాడు.

ప్రతీక్ గాంధీ, సెంథిల్ రామ్ముర్తిలతో న్యూ ఏజ్ సినిమా చేయబోతుంది విద్యాబాలన్. ప్రతీక్ గాంధీ ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో పేరుతెచ్చుకుంటున్నాడు. సో విద్యా అతనితో కలిసి ఈ ప్రాజెక్ట్ లో రొమాన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే సినిమాలో ఇలియానా డిక్రూజ్ కూడా కనిపించబోతుంది. విద్యానే కాదు మరికొంత మంది స్టార్ హీరోయిన్లు కూడా తమకంటే  స్టార్ డమ్ లో.. వయస్సులో చిన్న హీరోలతో నటించడానికి రెడీ అంటున్నారు. ఈ లిస్ట్ లో.. తక కంటే వయస్సులో చిన్నవాడైన నిక్ జోనస్ ను పెళ్లాడినా ప్రియాంక, కరినా కపూర్ లాంటి హీరోలు ఉన్నారు.

Latest Videos

click me!