Published : Jan 05, 2022, 09:31 PM ISTUpdated : Jan 05, 2022, 09:56 PM IST
అనేక అనుమానాలు మధ్య పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప (Pushpa)అన్ని భాషల్లో అదరగొడుతుంది. ముఖ్యంగా హిందీలో పుష్ప కలెక్షన్స్ చూసిన ట్రేడ్ వర్గాలు నోరెళ్లబెడుతున్నారు. స్లోగా మొదలైన పుష్ప రన్ రోజురోజుకూ పుంజుకుంది. రూ. 60 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో క్లీన్ హిట్ గా నిలిచింది.
మలయాళ వెర్షన్ సైతం భారీ వసూళ్లు అందుకుంది. కేరళలో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ చిత్రంగా పుష్ప రికార్డులకు ఎక్కింది. ఇక అన్ని భాషల్లో కలిపి పుష్ప రూ. 300 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లు రాబట్టింది. పుష్ప విడుదలై మూడు వారాలు గడుస్తున్నా థియేటర్స్ లో సందడి తగ్గలేదు. అయితే అమెజాన్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం థియేటర్స్ రన్ కొనసాగుతుండగానే ఓటిటిలో విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
25
జనవరి 7 నుండి అమెజాన్ ప్రైమ్ (Pushpa on Amazon prime)లో పుష్ప స్ట్రీమ్ కానుంది. ఇక పుష్ప ఓటిటి హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ పై నమ్మకముంచిన అమెజాన్ తీవ్ర పోటీ మధ్య పుష్ప ఓటిటి హక్కులు దక్కించుకుంది. మరి పుష్ప హక్కుల కోసం అమెజాన్ ఎంత చెల్లించిందో తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే.
35
ఏకంగా రూ. 22 కోట్లు తెలుగు వెర్షన్ కి అమెజాన్ చెల్లిందని వినికిడి. కేవలం ఓటిటి హక్కుల కోసం అంత మొత్తంలో చెల్లించడం రికార్డు అని చెప్పాలి. ఇక అన్ని భాషల్లో కలిపి రూ. 60-70 కోట్ల వరకు ఓటిటి హక్కులు పలికాయని సమాచారం. భారీ వసూళ్లతో లాభాలు తెచ్చిపెట్టిన పుష్ప ఓటిటి రైట్స్ ద్వారా నిర్మాతలకు మరింత ఆదాయం అందించింది.
45
pushpa hindi release in us
పుష్ప మూవీని దక్కించుకున్న అమెజాన్ సంక్రాంతి సీజన్ ని ఫుల్ గా క్యాష్ చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మూవీకి వచ్చిన హైప్ రీత్యా పుష్పక్ కోసం ప్రేక్షకులు పోటెత్తే ఆస్కారం కలదు. సంక్రాంతికి అమెజాన్ చందాదారుల సంఖ్య కూడా బాగా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. పుష్ప డిజిటల్ రైట్స్ దక్కించుకోవడం ద్వారా అమెజాన్ మంచి డీల్ దక్కించుకుందని చెప్పాలి.
55
pushpa
దర్శకుడు సుకుమార్ (Sukumar)ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప చిత్రాన్ని తెరకెక్కించారు. అల్లు అర్జున్ (Allu Arjun)స్మగ్లర్ గా డీ గ్లామర్ రోల్ చేశారు . రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా సునీల్, అనసూయలతో పాటు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ చేస్తారు. పుష్ప సెకండ్ పార్ట్... 2022 దసరా కానుకగా విడుదల కానుంది.