ఆ పాట ఎందుకు పాడానో అని బాధపడుతున్నా, శ్రేయా ఘోషల్ సంచలన వ్యాఖ్యలు

Published : Feb 28, 2025, 12:42 PM ISTUpdated : Feb 28, 2025, 12:44 PM IST

ఇండియన్ స్టార్ సింగర్ గా అన్ని భాషల్లో పేరు తెచ్చుకుంది శ్రేయా ఘోషల్. వేల పాటలు పాడిన ఆమెకు భాషతో సబంధం లేకుండా ప్యాన్స్ ఉన్నారు. ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించిన ఈసింగర్.. ఒక పాట విషయంలో మాత్రం బాధపడుతుంది. ఆ పాట పాడకుండా ఉండాల్సిందని ఫీల్ అవుతోంది.   

PREV
14
ఆ పాట ఎందుకు పాడానో అని బాధపడుతున్నా,  శ్రేయా ఘోషల్ సంచలన వ్యాఖ్యలు
సింగర్ శ్రేయా ఘోషల్

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ అని చాలా భాషల్లో పాటలు పాడి భారతదేశంలో మంచి పేరు తెచ్చుకున్నారు శ్రేయా ఘోషల్. ఆమె చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్‌తో పని చేశారు. శ్రేయా ఘోషల్ పాట అంటే చెవుల్లో అమృతం పోసినట్టు ఉంటుంది. అంత మధురంగా ఉంటుంది  ఆమె స్వరం. 

Also Read: SSMB 29 : మహేష్ బాబు ఫైనల్ లుక్ లీక్, సింహంలా జూలు విదుల్చుతున్న సూపర్ స్టార్

24
శ్రేయా ఘోషల్ పాట వివాదం

ఎన్నో వేల అద్భుతమైన పాటలు పాడిన శ్రేయా ఓ పాట విషయంలో మాత్రం బాధపడుతున్నట్టు వెల్లడించింది.  బాలీవుడ్‌లో ఒక ఐటమ్ పాట పాడినందుకు బాధపడుతున్నానని శ్రేయా ఘోషల్ రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దాని గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

Also Read: 100 కోట్లు ఇచ్చినా ఆ హీరో పక్కన నటించను, గోల్డెన్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన నయనతార, ఇంతకీ ఎవరా హీరో?

34
చిక్నీ చమేలీ గురించి శ్రేయా ఘోషల్ కామెంట్

చిక్నీ చమేలీ గురించి శ్రేయా ఘోషల్ మాట్లాడుతూ.. ఆ పాట పాడినందుకు బాధపడుతున్నానని  అన్నారు. ఎందుకంటే ఆ పాట అర్థం ఏమిటో తెలియకుండానే పిల్లలు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అన్నారు. 

Also Read: బిగ్ బాస్ తెలుగు నుంచి నాగార్జున ఔట్, కొత్త హోస్ట్ గా పరిశీలనలో ఇద్దరు స్టార్ హీరోలు?

44
చిక్నీ చమేలీ సాంగ్‌తో శ్రేయా ఘోషల్ సంతోషంగా లేరు

ఇలాంటి పాటలు మగవాళ్లు రాయడం వల్ల అందులో ఆడవాళ్లను కించపరిచే పదాలు ఎక్కువగా ఉంటాయని శ్రేయా ఘోషల్ చెప్పారు. ఆడవారు కూడా పాటలు రాస్తే.. ఇటువంటి పదాలకు బ్రేక్ పడుతుందన్న అభిప్రాయం ఆమె వ్యక్తం చేశారు.  ఆమె ఈ అభిప్రాయానికి కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు.

Also Read: 53 ఏళ్ళ బ్యాచిలర్ హీరోయన్,5 ఏళ్లుగా టాలీవుడ్ పై అలిగిన ముదురు భామ ఎవరో తెలుసా?

Also Read:20 ఏళ్ళుగా రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్న స్టార్ హీరో, ఎవరో తెలుసా?

Read more Photos on
click me!

Recommended Stories