ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. కొత్త హోస్ట్ లుగా ఇద్దరు స్టార్ హీరోల పేర్లు మాత్రం పరిశీలనలో ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అందులో ముందుగా నందమూరి నటసింహం బాలయ్యబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఆహాలో అన్ స్టాపబుల్ అంటూ.. బ్లాక్ బస్టర్ షోను రన్ చేస్తున్నాడు బాలయ్య.
ఇప్పటికే మూడు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. బాలకృష్ణ కనుక బిగ్ బాస్ హోస్ట్ గా ఎంటర్ అయితే.. షోరేటింగ్స్ బ్లాస్ట్ అవుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ షోకు నందమూరి ఫ్యాన్స్ కూడా యాడ్ అయ్యి ముందుకు నడిపిస్తారు. ఇప్పటికే ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలయ్యను బిగ్ బాస్ హోస్ట్ గా చూడాలి అనుకుంటున్నారు అభిమానులు. అయితే అటు సినిమాలు, ఇటు రాజకీయాలు అంటూ బిజీగా ఉన్న బాలయ్యకు ఈ షోను మూడు నెలలు నడిపించే టైమ్ ఉంటుందా అనేది సందేహం. ఆరకంగా బిగ్ బాస్ టీమ్ ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది.
Also Read: నాగార్జున కు నైట్ నిద్ర పట్టకపోతే ఏం చేస్తాడో తెలుసా? టాలీవుడ్ మన్మథుడి స్లీపింగ్ సీక్రెట్ ?