జానీ మాస్టర్‌పై ఆరోపణలతో వార్తల్లో నిలిచిన కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ.. `బిగ్ బాస్ తెలుగు 9`లోకి ఎంట్రీ ఇచ్చి మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె ఐటెమ్ సాంగ్‌తో రాబోతుండటం విశేషం.
`పుష్ప 2` కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకుంది శ్రష్టి వర్మ. జానీ మాస్టర్ పై ఆరోపణలు చేసి సంచలనంగా మారింది. ఆయనతో కలిసి పనిచేసిన శ్రష్టి.. ఆ తర్వాత జానీ మాస్టర్ తనని వేధించాడని ఆరోపించింది. ఈ కేసులో జైలుకి కూడా వెళ్లి వచ్చాడు జానీ మాస్టర్. ఆ తర్వాత `పుష్ప 2` సినిమాకి కొరియోగ్రాఫర్‌గానూ పనిచేసింది శ్రష్టి. అనంతరం ఇటీవల `బిగ్ బాస్ తెలుగు 9`లోకి ఎంట్రీ ఇచ్చింది. 9వ సీజన్ బిగ్ బాస్‌లో పాల్గొని అలరించింది. కానీ మొదటివారమే బయటకు వచ్చింది. ఏమాత్రం కంటెంట్ ఇవ్వలేకపోయింది, దీంతో వారంలోనే ఎలిమినేట్ అయ్యింది.
24
ఐటెమ్ సాంగ్‌తో రాబోతున్న శ్రష్టి వర్మ
ఓ వైపు సోలో డాన్స్ వీడియోలు, మరోవైపు సినిమా కొరియోగ్రఫీ చేస్తున్న శ్రష్టి వర్మ.. ఇప్పుడు రూట్ మార్చింది. డేటింగ్ స్టెప్ తీసుకుంది. ఐటెమ్ గర్ల్ గా మారింది. తాజాగా ఆమె `ధర్మస్థల నియోజకవర్గం` అనే మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తోంది. దీనికి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేశారు. `న్యాయం చేయరా దేవడా` అంటూ సాగే పాటలో ఆమె నర్తిస్తోంది. ఈ పాటని త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఈ పాటకి శ్రష్టి స్టెప్పులు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవబోతున్నాయి. అంతేకాదు సినిమాకి మంచి పాపులారిటీని తీసుకురాబోతుంది. మామూలుగా అయితే ఈ మూవీ వస్తుందనే విషయం కామన్ ఆడియెన్ కి తెలియదు. ఇప్పుడు శ్రష్టి ఐటెమ్ సాంగ్ పోస్టర్ తో టాక్ ఆఫ్ ఇది ఇండస్ట్రీగా మారిపోయింది.
వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న `ధర్మస్థల నియోజకవర్గం`లో సుమన్, సాయికుమార్ కీలక పాత్రల్లో మెరవబోతున్నారు. వరుణ్ సందేశ్, వితికాషేర్ రియల్ లైఫ్ జోడి అనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రంలో జంటగా కనిపించబోతుండటం విశేషం. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుందట. ఈ విషయాన్ని చిత్ర బృందం తాజాగా వెల్లడించింది.
డిఫరెంట్ పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ధర్మస్థల నియోజకవర్గం ఉంటుందని దర్శకుడు తెలిపారు. శ్రష్టి వర్మ నటించిన `న్యాయం చేయరా దేవుడా` లిరికల్ సాంగ్‌తో ఈ సినిమా ప్రమోషన్స్‌ని మొదలు పెట్టబోతున్నాం. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ అందించిన లిరిక్స్, స్టార్ సింగర్ సునీత ఆలపించిన పాటలు ఆకట్టుకుంటాయి. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు.
ఇదిలా ఉంటే శ్రష్టి వర్మకి కొరియోగ్రాఫర్‌గా పెద్దగా ఆఫర్లు లేవని తెలుస్తోంది. ఈ క్రమంలో తనకు ఉన్న క్రేజ్‌ని ఇలా వాడుకోబోతుందట. నటిగానూ నిరూపించుకోవాలనుకుంటుందట. అందులో భాగంగానే ఐటెమ్ సాంగ్ చేసేందుకు ఒప్పుకుందని సమాచారం. ఏదేమైనా శ్రష్టి ఒక డేరింగ్ స్టెప్ తీసుకుంది. మరి ఎంత వరకు రాణిస్తుందో చూడాలి.