Nayanthara చేసిన చిన్న మిస్టేక్‌, దెబ్పకి పాన్‌ ఇండియా హీరోయిన్‌ అయిపోయిన అనుష్క

Published : Feb 17, 2026, 10:28 PM IST

Nayanthara: లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార చిన్న మిస్టేక్‌ చేసింది. కానీ తర్వాత అది చాలా పెద్దగా మారిపోయింది. దీన్ని అనుష్క వాడుకుంది. పాన్‌ ఇండియా హీరోయిన్‌గా ఎదిగింది. ఈ కథేంటనేది చూస్తే 

PREV
15
నయనతార మిస్టేక్‌ వల్ల అనుష్క పాన్‌ ఇండియా హీరోయిన్‌

అనుష్క ప్రస్తుతం పాన్‌ ఇండియా హీరోయిన్‌ అని చెప్పొచ్చు. ఆమె `బాహుబలి`తో ఇండియా వైడ్‌గా పాపులర్‌ అయ్యింది. ఈ మూవీ ఆమె లైఫ్‌నే మార్చేసింది. దీంతో ఇప్పుడు టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తుంది. ప్రస్తుతం చాలా సెలక్టీవ్‌గా వెళ్తోంది. ఇటీవల `ఘాటి` మూవీతో నిరాశ పరిచిన విషయం తెలిసిందే. అయితే అనుష్క పాన్‌ ఇండియా హీరోయిన్‌ కావడం వెనుక లేడీ సూపర్‌ నయనతార ఉందట. నయనతార చేసిన చిన్న మిస్టేక్‌ అనుష్క లైఫ్‌ నే మార్చేసిందట.

25
బాహుబలితో పాన్‌ ఇండియా వైడ్‌గా పాపులర్‌ అయిన అనుష్క

అనుష్కని నటిగా మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రాలు `అరుంధతి` ఒకటి. ఆ తర్వాత `బాహుబలి`తో ఆమె తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ఇండియా వైడ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేయగా, రానా, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్‌ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ఇండియన్‌ సినిమాని షేక్‌ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఇండియా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

35
బాహుబలికి నో చెప్పిన నయనతార

ఈ సినిమాలో దేవసేనగా అనుష్క శెట్టి నటించింది. యువరాణిగా, ఆ తర్వాత భళ్లాలదేవ చేత చిత్రహింసలు అనుభవించిన యోధురాలిగా ఆమె కనిపించింది. రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఈ మూవీలో మొదట అనుకున్నది అనుష్క కాదు. రాజమౌళి ఫస్ట్‌ ఛాయిస్‌ స్వీటి కాదు. నయనతారని అనుకున్నారట. దేవసేన పాత్ర కోసం ఆమెని తీసుకోవాలనుకున్నారట. కానీ ఆమె నో చెప్పిందట. సినిమా ప్రారంభంలో రాజమౌళి నయనతారని కలిసినప్పుడు రెండేళ్లు ఈ మూవీకి కేటాయించాలని చెప్పారట. దీంతో తాను నో చెప్పిందట.

45
నయనతార నో చెప్పడంతో అనుష్క కి జాక్‌ పాట్‌

రెండేళ్లు ఒక్క సినిమాకే కేటాయించడం ఇష్టం లేక రాజమౌళి ఆఫర్‌ని రిజెక్ట్ చేసింది నయనతార. అప్పుడు ఆమె అనుకోలేదు, తాను ఒక ఇండియన్‌ సినిమా జాతకాన్ని మార్చే మూవీని రిజెక్ట్ చేస్తున్నానని, మొత్తంగా నో చెప్పింది. దీంతో రాజమౌళి.. అనుష్కని అప్రోచ్‌ అయ్యారు. ఆమె వెంటనే ఓకే చెప్పింది. అలా `బాహుబలి`లోకి అనుష్క వచ్చింది. తనదైన నటనతో అదరగొట్టింది. విశ్వరూపం చూపించింది. తన ఓవర్‌ వెయిట్‌, అనారోగ్య కారణాలతో ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా వెళ్తోంది అనుష్క.

55
నయనతారకి సైతం పాన్‌ ఇండియా ఇమేజ్‌

ఇదిలా ఉంటే నయనతార కూడా ఇప్పుడు తక్కువేం కాదు. ఆమె కూడా పాన్‌ ఇండియా చిత్రాల్లో భాగమవుతుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తుంది. బిగ్‌ కమర్షియల్‌ మూవీస్‌లో  భాగమవుతుంది. ఇటీవల ఆమె చిరంజీవితో `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీలో నటించింది. పెద్ద హిట్‌ అందుకుంది. ఇప్పుడు బాలయ్యతో గోపీచంద్‌ మలినేని రూపొందిస్తున్న మూవీలో నటిస్తుందని సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories