Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఎంట్రీలతో సందడి చేస్తోంది. ఈ సీజన్‌లో ఐదవ కంటెస్టెంట్‌గా ఫేమస్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ హౌస్‌లోకి అడుగుపెట్టారు.
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది. హోస్ట్ కింగ్ నాగార్జున స్టైల్, ఎనర్జీతో షోలో ఎంట్రీ ఇస్తూ మొదటి ఎపిసోడ్‌కు హంగులు జోడించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోలు ఆడియన్స్‌లో ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేశాయి. వాటికి తగ్గట్టుగానే షో మొదటి ఎపిసోడ్ కూడా కలర్‌ఫుల్‌గా సాగింది.
ఈసారి బిగ్ బాస్ "డబుల్ హౌస్ – డబుల్ డోస్" అనే కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు వేర్వేరు హౌస్‌లు ఉండటంతో కంటెస్టెంట్స్ మధ్య కంపిటీషన్, డ్రామా, కాంట్రవర్సీస్ మరింత ఎంటర్టైనింగ్‌గా ఉండబోతున్నాయని మేకర్స్ హింట్ ఇచ్చారు.
24
కొరియోగ్రాఫర్ శ్రష్టి ఎంట్రీ
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఎంట్రీలతో సందడి చేస్తోంది. ఈ సీజన్‌లో ఐదవ కంటెస్టెంట్‌గా ఫేమస్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఎంట్రీకి ముందే స్టేజ్‌పై అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు శ్రష్టి వర్మ మాట్లాడుతూ, " ప్లుట్ జింకా ముందు ఊదు.. శ్రేష్టి వర్మ ముందు కాదు ’ అంటూ వచ్చి రాగానే వార్నింగ్ ఇచ్చింది. ఈ హౌస్‌లో మనలోని అసలైన రియాలిటీ బయటపడుతుంది. ‘నన్ను నేను నిరూపించుకునే వేదిక ఇది" అని ఎమోషనల్‌గా చెప్పారు.
34
శ్రష్టి కెరీర్ జర్నీ
శ్రష్టి వర్మ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. "మనమే" మూవీలో శర్వానంద్‌కి, అలాగే రీసెంట్‌గా "పుష్ప 2" పాటలకు కొరియోగ్రఫీ చేశారు. ఢీ డ్యాన్స్ రియాలిటీ షో ద్వారా పరిచయం పొందిన ఆమె, జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించారు. తన ఎనర్జీ, డ్యాన్స్ మూవ్స్‌తో చిన్నకాలంలోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
కొద్ది కాలం క్రితం శ్రష్టి వర్మ తనకు లైంగిక వేధింపులు చేశారంటూ జానీ మాస్టర్‌పై కేసు పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. ఆ విషయంతో సోషల్ మీడియాలో, టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అయ్యారు. ఈ కారణంగా ఆమె పేరు మరింతగా హైలైట్ అయింది. డ్యాన్స్‌లో ఎనర్జీ, రియల్ లైఫ్‌లో బోల్డ్ అటిట్యూడ్ కలిగిన శ్రష్టి వర్మ బిగ్ బాస్ హౌస్‌లో ఎలా ఆడుతారు? ఇతర కంటెస్టెంట్స్‌తో ఎలా కలిసిపోతారు? అనేది ప్రేక్షకులలో ఆసక్తిని రేపుతోంది. ముఖ్యంగా, ఆమె బోల్డ్ నేచర్ బిగ్ బాస్ 9లో ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొత్త కలర్ ఇస్తుందని భావిస్తున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్.