హౌస్ లోకి ఆరవ కంటెస్టెంట్ గా మాస్క్ మాన్ హరీష్.. అసహ్యించుకున్న బిందు మాధవే ఎంపిక చేసిందిగా..

Published : Sep 07, 2025, 09:04 PM IST

బిగ్ బాస్ తెలుగు 9 హౌస్ లోకి కామనర్ మాస్క్ మాన్ హరీష్ ఎంట్రీ ఇచ్చారు. అగ్ని పరీక్షలో ఒక రేంజ్ లో హంగామా చేసిన హరీష్ కి హౌస్ లోకి ఎంట్రీ దక్కింది. 

PREV
13

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 6వ కంటెస్టెంట్ గా కామనర్ కి అవకాశం దక్కింది. ఆ సామాన్యుడు ఎవరో కాదు అగ్ని పరీక్షలో ఒక రేంజ్ లో హంగామా చేసిన మాస్క్ మాన్ హరీష్. తన పేరుని తన భార్య పేరుతో కలిపి హరితా హరీష్ అని పెట్టుకున్నారు. 

23

తన వ్యక్తిత్వానికి తగ్గట్లుగా హృదయ్ మానవ్ అనే పేరు కూడా పెట్టుకున్నట్లు హరీష్ తెలిపారు. హరీష్ కి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం బిందు మాధవి ద్వారా దక్కింది. బిందు మాధవి అతడిని ఎంపిక చేసింది. నాగార్జున ముందు హరీష్ పై బిందు మాధవి ఒక రేంజ్ లో ప్రశంసలు కురిపించింది. ఆయన చాలా స్ట్రైట్ ఫార్వార్డ్ గా మాట్లాడతారు. ధైర్యంగా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతూ ఎదుటి వారిని లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్ కి ఈ క్వాలిటీ చాలా అవసరం అని బిందు మాధవి పేర్కొంది. 

33

అగ్ని పరీక్షలో ఉన్న సమయంలో హరీష్ గుండు గీయించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హరీష్ వేదికపైకి రాగానే బిగ్ బాస్ అతడికి కండిషన్ పెట్టారు. హౌస్ లో ఉన్నన్ని రోజులు గుండుతోనే ఉండాలని తెలిపారు. అగ్ని పరీక్షలో ఉన్న సమయంలో హరీష్ తన భార్యని కొట్టానని అంగీకరించారు. దీనితో బిందు మాధవి అతడిని అసహ్యించుకున్నారు. చివరికి బిందు మాధవే అతడిని ఎంపిక చేసింది. హరీష్ విషయంలో ముందుగా తాను రాంగ్ జడ్జ్ చేశానని పేర్కొంది. 

Read more Photos on
click me!

Recommended Stories