బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. డబుల్ హౌస్, సిలబస్ అంటూ బిగ్ బస్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చేశారు. ఇక ఈ హౌస్ లో డిఫరెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు జబర్ధస్త్ స్టార్ కమెడియన్ ఇమ్మ్యాన్యూయల్. పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్, గ్యాప్ లేకుండా పంచులు.. తన ఎమోషన్స్ తోనే నవ్వుల్లో ముంచెత్తే ట్యాలెంట్ ఉన్నఇమ్మ్యాన్యూయల్, ఎలాంటి బ్యాక గ్రౌండ్ లేకుండా ఈ రంగంలోకి అడుగు పెట్టి, తన ట్యాలెంట్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అందంగా లేవని అవమానాలు ఎదురైనా, బాడీ షేమింగ్ కామెంట్స్ తో వేధించినా దానినే పాజిటివ్ గా మల్చుకున్నాడు. తన యాక్టింగ్ తో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నాడు.