శ్రద్ధా కపూర్ వదులుకున్న 7 బ్లాక్‌ బస్టర్‌ మూవీస్‌, ఇండియా నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ అయ్యే ఛాన్స్ మిస్‌

Published : May 19, 2025, 10:54 PM ISTUpdated : May 20, 2025, 09:14 AM IST

ప్రభాస్‌ `సాహో` హీరోయిన్‌ శ్రద్ధ కపూర్ చాలా పెద్ద సినిమాలు వదులుకుంది. దీంతో కెరీర్ డౌన్‌ అయ్యింది. మరి ఆమె ఈ మూవీస్‌ని వదులుకోవడానికి గల కారణాలు తెలుసుకుందాం. 

PREV
17
భూల్ భులైయా 2

కార్తీక్ ఆర్యన్ `భూల్ భులైయా 2 `సినిమాకి మొదట శ్రద్ధనే అనుకున్నారు. కానీ ఆమె వద్దంది. తర్వాత కియారా అద్డ్వాణీ చేసింది.

27
లక్కీ: నో టైం ఫర్ లవ్

శ్రద్ధ కపూర్‌.. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన `లక్కీ` సినిమాతో బాలీవుడ్‌లోకి రావాల్సింది. చదువు కోసం వదులుకుంది.

37
థగ్స్ ఆఫ్ హిందూస్తాన్

ఆమిర్ ఖాన్  `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్‌`లో హీరోయిన్‌గా మొదట శ్రద్ధనే అనుకున్నారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. దీంతో కత్రినా నటించింది.

47
ఔరంగజేబ్

`ఔరంగజేబ్` సినిమాలో హీరోయిన్‌గా మొదటి ఆఫర్‌ శ్రద్ధకి వచ్చింది. ఆ సమయంలో `ఆషిఖి 2` చేస్తుంది శ్రద్దా కపూర్‌. దీంతో ఈ మూవీని వదులుకోవాల్సి వచ్చింది. 

57
సైనా

సైనా నెహ్వాల్ బయోపిక్‌లో మొదట శ్రద్ధనే అనుకున్నారు.  టెస్ట్ షూట్‌ చేశారు, అధికారికంగా ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో ఈ మూవీ నుంచి శ్రద్ధా తప్పుకుంది. ఆమె వద్దనడంతో పరిణీతి చోప్రా చేసింది.

67
RRR

రాజమౌళి RRR లో ఆలియా భట్ పాత్రకి మొదట శ్రద్ధనే అనుకున్నారు. ఆమె వదులుకుంది. ఈ సినిమా 1100 కోట్లు సంపాదించింది. బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ ఛాన్స్ ని శ్రద్ధా మిస్‌ చేసుకుంది. 

77
ఎక్తా కపూర్ చెప్పని సినిమా

శ్రద్ధ కపూర్ లేటెస్ట్ గా ఎక్తా కపూర్ బిగ్ బడ్జెట్ సినిమాని వదులుకుంది. దీనికి కారణం పారితోషికం గొడవ అని సమాచారం. ఇలా కొన్ని భారీ సినిమాలను మిస్‌ చేసుకుని కెరీర్‌ని డౌన్‌ చేసుకుంది శ్రద్ధా. ఆ మూవీస్‌ పడి ఉంటే ఇప్పుడు ఇండియన్‌ టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా నిలిచేది శ్రద్ధా కపూర్‌. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories