Karthika deepam: నిరుపమ్, హిమల పెళ్లి తానే చేస్తానన్న శౌర్య.. దిక్కుతోచని స్థితిలో ప్రేమ్!

First Published Aug 6, 2022, 8:48 AM IST

Karthika deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 6వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
 

ఎపిసోడ్ ప్రారంభంలోనే.... సౌందర్య, శోభని కొడతాది.స్వప్న,మా ఇంటికి వచ్చి నాకు కాబోయే కోడలి కొడతారా? అని అనగా ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా కొడతాను.ఎవరు నీకు కాబోయే కోడలు ఇదా? హిమే నీకు కాబోయే కోడలు అని చెప్పి ఇన్విటేషన్ కార్డ్ ని స్వప్నకి ఇచ్చి ఈ ముహూర్తాన నిరూపముకి హిమకి పెళ్లి కచ్చితంగా జరుగుతుంది అని చెప్తుంది.నా కొడుకు మీద నీకేంటి హక్కు అని స్వప్న అడగగానే నీ మీద హక్కు ఉంది,నీ కొడుకెంత? అని అంటుంది సౌందర్య.నేను ఎలాగైనా పెళ్లిని ఆపుతాను అని స్వప్న అంటుంది.
 

 నీకు చేతనైంది చేసుకో అని సౌందర్య స్వప్న కి తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాని తర్వాత సీన్లో హిమా ప్రేమ్ దగ్గరికి వెళ్తుంది. ప్రేమ్ ఆశగా, నువ్వు ఇక్కడికి రమ్మని పిలిచేసరికి నేను ఎంత ఆనందపడ్డానో అని అంటాడు. హిమకి విషయం అర్థమై నేను ఆ విషయం గురించి పిలవలేదు బావ.ఈ పెళ్లిని ఎలాగైనా ఆపు నీకు రుణపడి ఉంటాను అని అంటుంది.ప్రేమ్ మనసులో, ఈ పెళ్లి ఆపితే నైనా హిమకి నామీద మంచి అభిప్రాయం వస్తుంది అని అనుకుంటాడు.
 

 దాని తర్వాత సీన్లో సౌర్య,టిఫిన్ కొట్టులో ఆనందరావు  ( మోనిత కొడుకు) తో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడుతూ ఉండగా, శోభా అని ఎవరో నీ గురించి వచ్చారు .చాలా బాగా మాట్లాడారు అని అంటాడు. ఎందుకు వచ్చింది అని శౌర్య అడగగా, నీ గురించి అడగడానికి వచ్చారు. కానీ నువ్వు ఈ మధ్య ఎక్కడికి రావట్లేదు అని చెప్పాను అని అంటాడు. దాని తర్వాత ఆనందరావు, ఈ మధ్య నువ్వు మీ నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నావంట కదా.
 

 దాని తర్వాత సీన్లో సౌర్య,టిఫిన్ కొట్టులో ఆనందరావు  ( మోనిత కొడుకు) తో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడుతూ ఉండగా, శోభా అని ఎవరో నీ గురించి వచ్చారు .చాలా బాగా మాట్లాడారు అని అంటాడు. ఎందుకు వచ్చింది అని శౌర్య అడగగా, నీ గురించి అడగడానికి వచ్చారు. కానీ నువ్వు ఈ మధ్య ఎక్కడికి రావట్లేదు అని చెప్పాను అని అంటాడు. దాని తర్వాత ఆనందరావు, ఈ మధ్య నువ్వు మీ నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నావంట కదా.
 

 ఆ ఇల్లు చాలా పెద్దదని విన్నాను. నన్ను ఎప్పుడైనా అక్కడికి తీసుకెళ్తావా? అని అడగగా, అది నీ ఇల్లే. నువ్వు మౌనిత ఆంటీ కొడుకువి కానీ ఇప్పుడు నిన్ను అక్కడికి తీసుకెళ్తే నిన్ను ఎవరూ పట్టించుకోరు అని మనసులో అనుకుంటుంది. దాని తర్వాత శోభ,స్వప్న దగ్గరికి వచ్చి కళ్యాణ మండపంలో నిరూపమ్, హిమల పెళ్లి కోసం అరేంజ్మెంట్స్ అయిపోతున్నాయి అని అంటుంది.స్వప్న, శోభ ఇద్దరూ నవ్వుకొని మనకి ఎక్కువ భారం లేకుండా పెళ్లి పనులు అయిపోతున్నాయి.
 

 థాంక్యూ మమ్మీ అని శోభ అంటూ ఇద్దరూ నవ్వుకుంటారు. అదే సమయంలో నిరూపమ్ అక్కడికి వచ్చి ఆపుతారా? అని అరుస్తాడు. అమ్మకంటే పట్టుదల ఎక్కువ.నీకేమైంది శోభ? అని అడగగా మీ మావయ్య డాక్టర్ కార్తీక్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదంట. పేరు మౌనిత. నీకు మీ మామయ్య పోలికలు వస్తే నాకు మౌనిక క్యారెక్టర్ వచ్చింది. నేను పట్టుదలతోనే ఉంటాను.అస్సలు వదలను అని అంటుంది. నేను హిమ ప్రేమిస్తున్నాను,హేమనే పెళ్లి చేసుకుంటాను, అని అంటాడు.
 

 నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను బావ అని హిమతో చెప్పిస్తే నేను సైడ్ అయిపోతాను అని అంటుంది  శోభ.నువ్వు తినట్లేదు అని చెప్పి బాధతో ఇక్కడికి వచ్చాను చ్చీ!! అని వెళ్ళిపోతాడు నిరుపమ్. దాని తర్వాత సీన్లో సౌర్య తన ఇంటి బయట కూర్చుని ఇంత పెద్ద ఇల్లు ఉన్నా సరే ఇక్కడ ఎవరూ నా వాళ్ళు అనిపించట్లేదు అని బాధపడుతూ ఉంతుంది.ఆనందరావు అక్కడికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావ్ అమ్మ? అని అడుగుతాడు.
 

 సౌర్య,తనని తాను చులకన చేసుకుంటూ ఆటో నడిపే దాన్ని నాకేం ఆలోచించుకుంటాయి అని అనగా ఈ ఇల్లు నీదేనమ్మా నువ్వు అలా అనుకోవద్దు. నువ్వు ఆనందరావు సౌందర్యం మనవరాలు కానీ నీకు నచ్చినోడు తో పెళ్లి చేయలేకపోతున్నాను అని బాధేస్తుంది అని అనగా నాకు అవసరం లేదు తాతయ్య. ఇష్టం లేకపోయినా మీ బలవంతం మీదే ఇంట్లో ఉంటున్నాను.ఇప్పుడు ఆ పెళ్లి కూడా చూసి ఆ ముచ్చట కూడా తీర్చుకొని వెళ్ళిపోతాను మీకు సంతోషమే కదా! అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
 

 తర్వాత సీన్లో ప్రేమ్ ఆ పెళ్లి ఆపడానికి అనీ వాళ్ళ నాన్న దగ్గర సలహా తీసుకోగా సత్యం, ప్రేమ, పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఆనందరావు ఎందుకు అలా ఉన్నారు? అని చెప్పి సౌందర్య అడగగా హిమ గురించి బాధపడుతూ ఉంటాడు.ఈ లోగ నిరుపమ్ అక్కడికి వచ్చి హిమతో తన పెళ్లి జరిపించుతున్నందుకు వాళ్ళ అమ్మమ్మ, తాతీయులకు ధన్యవాదాలు చెప్పి ఆశీర్వాదాలు తీసుకుంటాడు.
 

click me!