శ్రీముఖిపై `జబర్దస్త్` కమెడియన్లు ముద్దుల వర్షం.. తట్టుకోలేక స్టేజ్‌ నుంచి పారిపోయిన యాంకర్‌..

Published : Aug 06, 2022, 07:48 AM IST

యాంకర్‌ శ్రీముఖి, హైపర్‌ ఆది, రాంప్రసాద్‌ కలిసి కనిపించారంటే అక్కడ రచ్చ మామూలుగా ఉండదు. క్రేజీ పనులతో ఆద్యంతం నవ్వులు పూయిస్తుంటారు. ఇప్పుడు శ్రీముఖి ముద్దుల కోసం రెచ్చిపోవడం విశేషం.   

PREV
15
శ్రీముఖిపై `జబర్దస్త్` కమెడియన్లు ముద్దుల వర్షం.. తట్టుకోలేక స్టేజ్‌ నుంచి పారిపోయిన యాంకర్‌..

శ్రీముఖి(Sreemukhi)తో హైపర్‌ ఆది(Hyper Adi), రాంప్రసాద్‌(Ram Prasad) చేసిన ముద్దుల గేమ్‌ హైలైట్‌గా నిలిచింది. ఇదే ఇప్పుడు ట్రెండ్‌ అవుతుంది. మరి ఇంతకి ఏం జరిగిందంటే.. హైపర్‌ ఆదికి, రాంప్రసాద్‌లతో ఓ గేమ్‌ ప్లాన్‌ చేసింది శ్రీముఖి. ఇందులో సాంగ్‌ ప్లే చేస్తే అందులోని కొన్ని వస్తువులు, పేర్లుంటాయని, అవి తీసుకొచ్చి తన చేతిలో పెట్టాలని చెబుతుంది శ్రీముఖి. దీనికి సరే అని తలూపుతారు ఆది, రాంప్రసాద్‌. 

25

ఇంతలో పాటొచ్చింది. `శంకర్‌ దాదా జిందాబాద్‌`లోని ఆకలేస్తే అన్నపెడతా.. అలిసొస్తే ఆయిల్‌ పెడతా.. మూడొస్తే ముద్దులు పెడతా` అనే పాట ప్లే కావడంతో వస్తువుల కోసం పరిగెత్తిన హైపర్‌ ఆది, రాంప్రసాద్‌ మధ్యలోనే రూట్ మార్చారు. అన్నం, ఆయిల్‌ అనేవి పక్కన పెట్టి, మూడో దానికోసం పాకులాడారు. అదే ముద్దు. 
 

35

ఈ పాటలో `మూడొస్తే ముద్దులు పెడతా` అనేది రాగానే శ్రీముఖి వద్దకి పరుగెత్తారు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. ఏం జరగబోతుందనేది చూసే లోపే ఆది, రాంప్రసాద్‌ చేయాల్సింది చేసేశారు. శ్రీముఖికి ముద్దులు పెట్టారు. కాకపోతే ఆమె బుగ్గుమీద కాదు, చేతిలో పెట్టడం విశేషం. అయినా వీరిద్దరిని విదిల్చుకుని దూరం వెళ్లిపోయింది శ్రీముఖి. ఇదేంటని ప్రశ్నించగా, హైపర్‌ ఆది సీన్‌వివరించారు. `ఆకలేస్తే అన్నం పెడతా, అలసిసొస్తే ఆయిల్‌ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా` అని రావడంతో మూడోది ఇదే కదా అంటూ తాము చేసిన పనిని సమర్ధించుకున్నారు. దీంతో షో మొత్తం నవ్వులతో విరిసింది.
 

45

తనకు ఇంతటి అవమానం జరగడంతో శ్రీముఖి రెచ్చిపోయింది. గెస్ట్ గా వచ్చిన హీరో నవీన్‌ చంద్రని `బావా` అంటూ గట్టిగా పిలిచింది. దీంతో వెంటనే స్టేజ్‌పైకొచ్చాడు నవీన్‌ చంద్ర. ఆయన్ని దగ్గరికి తీసుకుని బుగ్గుపై శ్రీముఖి ముద్దు పెట్టడం విశేషం. దీంతో షోలో అంతా ఆశ్చర్యపోగా, ఆది, రాంప్రసాద్‌ నోరెళ్ల బెట్టడం హైలైట్‌గా నిలిచింది. 
 

55

దీనికి కంటిన్యూగా హైపర్‌ ఆది, రాంప్రసాద్‌ ఒకజంటగా, నవీన్‌ చంద్ర, శ్రీముఖి మరో జంటగా ఉండి ఈ గేమ్ కొనసాగించాలనుకున్నారు శ్రీముఖి. కానీ అప్పుడు కూడా `మొదటి సారి ముద్దు పెడితే ఎలాగుంటది.. ` అనే పాట వేశారు.  దీంతో ఈ ముద్దుల గోల తట్టుకోలేక షో నుంచే పారిపోయింది శ్రీముఖి. ఇదంతా `రాఖీ` పండుగ సందర్భంగా ఈటీవీలో చేసిన స్పెషల్‌ ప్రోగ్రామ్‌ `హలో బ్రదర్‌` లోనిది. ఇది రేపు ఆదివారం ప్రసారం కాబోతుంది. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories