పెళ్లై ఏడు నెలలకే డెలివరీ.. అలియాభట్‌పై ట్రోల్స్ వైరల్‌.. తెరపైకి కొత్త విషయాలు

Published : Nov 06, 2022, 08:38 PM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` నటి అలియాభట్ ఆదివారం పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు,సెలబ్రిటీలు రణ్‌బీర్‌-అలియా జంటకి అభినందనలు తెలియజేస్తున్నారు. కానీ ట్రోల్స్ సైతం వైరల్‌ కావడం ఆశ్చర్య పరుస్తుంది. 

PREV
17
పెళ్లై ఏడు నెలలకే డెలివరీ.. అలియాభట్‌పై ట్రోల్స్ వైరల్‌.. తెరపైకి కొత్త విషయాలు

బాలీవుడ్‌ క్రేజీ జంట రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ గత రెండు మూడేళ్లుగా ప్రేమించుకుని ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లై రెండు నెలలకు తమ ప్రెగ్నెన్నీని ప్రకటించారు రణ్‌బీర్‌, అలియా జంట. ఈ ప్రకటన వచ్చిన నాలుగు నెలలకే ఇప్పుడు తనకు పండంటి బేబీ గర్ల్ పుట్టిందని ప్రకటించారు. 
 

27

ఇదిలా ఉంటే అభిమానులు, సెలబ్రిటీలు వారికి అభినందనలు తెలియజేయడం ఓ వైపు వైరల్‌గా మారుతుంటే, వారిపై ట్రోల్స్ మరోవైపు హల్‌చల్‌ చేస్తున్నాయి. అలియాభట్‌ ఇంత త్వరగా డెలివరీ కావడం పట్ల అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పెళ్లై ఏడు నెలలకే అలియాభట్‌ డెలివరీ కావడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. 

37

అలియాభట్‌, రణ్‌బీర్‌ పెళ్లికి ముందు నుంచే డేటింగ్‌లో ఉన్నారు. అధికారికంగానే ప్రేమించుకుంటున్నారు. పెద్దల అంగీకారంతోనే వీరిద్దరు కలిసి తిరిగారు. పార్టీలకు, ఈవెంట్లకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లికి ముందే అలియా ప్రెగ్నెంట్‌ అయి ఉంటుందని, ప్రెగ్నెన్సీ కారణంగానే త్వరగా సైలెంట్‌గా పెళ్లి చేసుకుని ఉంటారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 

47

అయితే ఇద్దరు మనసులు కలిశాక, దాన్ని పెద్దలు ఒప్పుకున్నా, వాళ్లు ఎలా ఉన్నా అభ్యంతరం లేదు. కానీ పెళ్లైన ఏడు నెలలకే, ప్రెగ్నెన్సీ ప్రకటించిన నాలుగు నెలలకే బిడ్డకి జన్మనివ్వడంలో నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాన్నే ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇంటర్నెట్‌లో రచ్చ లేపుతున్నారు. 

57

అయితే సెలబ్రిటీల విషయంలో ఇది తరచూ జరుగుతూనే ఉంటుంది. గతంలో మరో బాలీవుడ్ జంట నేహా దూపియా విషయంలో అదే జరిగింది. ఆమె నటుడు, మోడల్‌ అంగద్‌ బేడీని 2018 మేలో పెళ్లి చేసుకుంది. నవంబర్‌ 18న కూతురు మెహర్‌ దుపియాకి జన్మనిచ్చింది. అప్పుడు కూడా ఇలాంటి చర్చనే జరిగింది.

67

వీరితోపాటు నీనా గుప్తా విషయంలో, అలాగే కమల్‌ భార్య సారిక సైతం శృతి హాసన్‌ పుట్టే సమయంలో ఇలానే జరిగింది. దీంతో అలియాభట్‌ కారణంగా పాత విషయాలను కూడా వెలికి తీస్తూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఇప్పుడిది హాట్‌ టాపిక్‌గా మారింది. 
 

77

ఇక అలియాభట్‌ తెలుగులోకి `ఆర్‌ఆర్‌ఆర్‌`తో ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు రణ్‌బీర్‌ కపూర్‌ సైతం `బ్రహ్మాస్త్ర`తో తెలుగు ఆడియెన్స్ ని పలకరించారు. ఈ ఇద్దరు కలసి నటించిన `బ్రహ్మాస్త్ర` ఫర్వాలేదనిపించుకుంది. ప్రస్తుతం అలియా `రాకీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ`, `హార్ట్ ఆఫ్‌ స్టోన్‌` చిత్రాల్లో నటించారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories