జాన్వీ కపూర్ తో డేటింగ్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన అతడి బ్యాగ్రౌండ్ తెలుసా ?

First Published Nov 6, 2022, 8:26 PM IST

జాన్వీ కపూర్ గ్లామర్ ఒకెత్తయితే అమ్మడి ప్రేమ వ్యవహారాలు కూడా బాలీవుడ్ లో బాగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జాన్వీ కపూర్.. ఒర్హాన్ అవత్రమణి అనే యువకుడితో డేటింగ్ చేస్తున్నట్లు ఘాటుగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

శ్రీదేవిలాగా జాన్వీ కపూర్ అతిలోక సుందరి కాదు. శ్రీదేవి డాటర్ గా బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన జాన్వీ కపూర్ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనితో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతోంది. 

జాన్వీ కపూర్ గ్లామర్ ఒకెత్తయితే అమ్మడి ప్రేమ వ్యవహారాలు కూడా బాలీవుడ్ లో బాగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జాన్వీ కపూర్.. ఒర్హాన్ అవత్రమణి అనే యువకుడితో డేటింగ్ చేస్తున్నట్లు ఘాటుగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం జాన్వీ కపూర్ తాను నటించిన మిలి చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. 

ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ తనపై వస్తున్న డేటింగ్ రూమర్స్ పై స్పందించింది. తాను డేటింగ్ లో ఉన్నట్లు అంగీకరించలేదు అలాగని ఖండించనూ లేదు. ఒర్హాన్ తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ అతడిని పొగడ్తలతో ముంచెత్తింది. 

చాలా కాలం నుంచి ఒర్హాన్ నా వెంట ఉంటున్నాడు. నా పక్కన అతడు ఉంటే ధైర్యంగా అనిపిస్తుంది. ఒర్హాన్ పై చాలా నమ్మకం ఉంది. అతడు గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపించింది. ఒర్హాన్ నా బెస్ట్ ఫ్రెండ్ అని పేర్కొంది. 

జాన్వీ కపూర్, ఒర్హాన్ కలసి పార్టీలు, వెకేషన్స్ చుట్టేస్తున్నారు. ఇటీవల దీపావళి సెలెబ్రేషన్స్ కలసి జరుపుకున్నారు. జాన్వీ, ఒర్హాన్ కలసి విదేశాలకు కూడా వెళుతున్నారు. ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీనితో వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు అనే రూమర్స్ బలపడ్డాయి. 

Image: Janhvi KapoorInstagram

ఇంతకీ ఒర్హాన్ ఎవరు అంటూ నెటిజన్లు అతడి గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. ఒర్హాన్ ఒక సోషల్ యాక్టివిస్ట్. యానిమేటర్ కూడా. బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ కి ఇతడు క్లాస్ మేట్. అంతే కాలేదు అజయ్ దేవగన్ కుమార్తె నైసాకి కూడా ఒర్హాన్ స్నేహితుడు. అతడికి సొంతంగా చోపర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఒర్హాన్ కి హాలీవుడ్ లో కూడా స్నేహితులు ఉన్నారు. 

click me!