పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఆస్తులపై రూమర్స్..రష్యా, సింగపూర్ లో అన్ని వందల కోట్లు ఉన్నాయా ?

First Published Jun 14, 2024, 4:06 PM IST

ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ సతీమణి అన్నా లెజినోవా మీడియాలో బాగా హైలైట్ అయ్యారు.ఎన్నికల ఫలితాలు రాగానే అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ ని వీరతిలకం దిద్ది హారతి పట్టిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. పవన్ కళ్యాణ్ కి కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి దక్కింది. వివిధ శాఖలకు ఆయన మంత్రిగా భాద్యతలు నిర్వహించబోతున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ సతీమణి అన్నా లెజినోవా మీడియాలో బాగా హైలైట్ అయ్యారు. 

ఎన్నికల ఫలితాలు రాగానే అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ ని వీరతిలకం దిద్ది హారతి పట్టిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. పవన్ తో కలసి ఆమె విజయవాడకి కూడా వచ్చారు. చంద్రబాబుని కలిశారు. ఆ తర్వాత మోడీ ప్రమాణ స్వీకారానికి కూడా అన్నా లెజినోవా పవన్ తో కలసి హాజరైంది. 

ఇక ఇటీవల చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తన భర్త మంత్రిగా ప్రమాణం చేస్తున్న దృశ్యాలు చూసి అన్నా మురిసిపోయారు. దీనితో సోషల్ మీడియాలో అన్నా లెజినోవా గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. జాతీయ మీడియా సైతం అన్నా లెజినోవా గురించి ప్రస్తావిస్తున్నారు.తాజాగా ఎన్డీటీవీ అన్నా లెజినోవా గురించి సంచలన రూమర్స్ ప్రస్తావించింది. 

1980లో అన్నా లెజినోవా రష్యాలో జన్మించారు. మోడల్ గా, నటిగా రాణించారు. తీన్మార్ చిత్ర షూటింగ్ లో తొలిసారి అన్నా లెజినోవా, పవన్ కలుసుకున్నారు. అప్పుడే వారి మధ్య ప్రేమ చిగురించింది. రెండేళ్ల డేటింగ్ తర్వాత పవన్ అన్నా లెజినోవాని 2013లో వివాహం చేసుకున్నారు. వీరికి పోలేనా అంజనా, మార్క్ శంకర్ సంతానం. 

ఎన్డీటీవీ ప్రచురించిన రూమర్స్ ప్రకారం అన్నా లెజినోవా కేవలం మోడల్ మాత్రమే కాదు. ఎంట్రప్రెన్యూర్ అని కూడా తెలుస్తోంది. రష్యా, సింగపూర్ లలో ఆమెకి భారీ స్థాయిలో హోటల్ వ్యాపారాలు ఉన్నట్లు తెలుస్తోంది. రష్యాలు ఆమెకున్న ఆస్తులు, వ్యాపారాలు మొత్తం కలిపితే ఆమె ఆస్తి 1800 కోట్ల వరకు ఉంటుందని ఎన్డీటీవీ పేర్కొంది. 

అయితే ఈ రూమర్స్ లో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి. ఏది ఏమైనా అన్నా లెజినోవా మెగా ఫ్యామిలిలో బాగా కలసి పోయింది. ప్రతి మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో అన్నా లెజినోవా సందడి చేస్తున్నారు. 

Latest Videos

click me!