అజయ్ ఘోష్ 'మ్యూజిక్ షాప్ మూర్తి' మూవీ రివ్యూ

First Published Jun 14, 2024, 2:51 PM IST

అజయ్ ఘోష్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి. ఈ మూవీ నేడు రిలీజ్ అయింది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం. 

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా టాలీవుడ్ లో అజయ్ ఘోష్ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. రంగస్థలం, పుష్ప చిత్రాల్లో అజయ్ ఘోష్ పోషించిన నెగిటివ్ రోల్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఆయన క్రేజ్ కూడా పెరిగింది. దీనితో అజయ్ ఘోష్ కి ప్రధాన పాత్రలో నటించే ఛాన్స్ వచ్చింది. అజయ్ ఘోష్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి. ఈ మూవీ నేడు రిలీజ్ అయింది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం. 

కథ : 

మ్యూజిక్ షాప్ మూర్తి(అజయ్ ఘోష్)కి 50 ఏళ్లు.  మ్యూజిక్ పై ఇంట్రెస్ట్ తో మ్యూజిక్ కాసేట్స్ షాప్ నడిపిస్తుంటాడు. కాలం మారింది మ్యూజిక్ కొత్త పుంతలు తొక్కుతుంది. డిజె ట్రెండ్ నడుస్తోంది. దీంతో మూర్తి షాప్ కి ఆదరణ తగ్గుతుంది. ఇల్లు గడవడం కష్టమవుతుంది. ఆయన భార్య జయ(ఆమని) ఆ షాప్ తీసేసి సెల్ ఫోన్ షాప్ పెట్టమని ఫోర్స్ చేస్తుంది. కానీ ఇష్టమైన పని వదులుకొనని తక్కువ ఆదాయం వచ్చినా దాన్నే నమ్ముకుంటాడు. మరో వైపు అంజన(చాందినీ చౌదరి) కి డిజే మ్యూజిక్ అంటే ఇష్టం. నేర్చుకుంటుంది. కానీ దాన్నే కెరీర్ గా ఎంచుకోవడాన్ని వ్యతిరేకిస్తారు. మ్యూజిక్ కాన్సోల్ నీ పగలకొడతాడు. దాన్ని రిపేర్ కోసం మూర్తి వద్దకు వెళ్తుంది.

Latest Videos


తనకు డిజే నేర్పిస్తే రిపేర్ చేస్తా అంటాడు. ఒప్పుకుంటుంది. అలా డిజె ప్లే చేయడం నేర్చుకుంటాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి జర్నీ చేస్తారు. దీంతో చూసిన జనాలు వీరిని తప్పుగా అనుకుంటారు. ఈ విషయం మూర్తి భార్య జయకి తెలిసి పెద్ద గొడవ చేస్తుంది. మళ్ళీ ఆ డిజె అంటే తాను సూసైడ్ చేసుకుంటా అని బెదిరిస్తుంది. అటు అంజన ఫాదర్ కూడా ఆమె కన్సోల్ నీ తగలబెడతారు. దీంతో ఆమె ఏం చేసింది. మూర్తి ఏం చేశాడు. డీజే ని వదిలేశాడా? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

విశ్లేషణ : 

50 ఏళ్ళ వయసున్న వ్యక్తి డీజేగా మారాలని కలలు కనే ఆసక్తికర పాయింట్ తో దర్శకుడు ఈ కథ రాసుకున్నారు. తన డ్రీం ని నెరవేర్చుకోవడం కోసం నటీనటులు పడే కష్టాలు చాలా సినిమాల్లో చూశాం. కానీ ఈ చిత్రంలో డైరెక్టర్ కొత్తగా ప్రజెంట్ చేశారు. డీజేగా మారడానికి మూర్తి పడుతున్న కష్టాలు, అతడి భార్య పెట్టే పోరు, కుటుంబ అనుబంధాల్ని చక్కగా చూపించారు. 

ఫస్ట్ హాఫ్ లో మూర్తి, అంజనా పరిచయం ఉంటుంది. కామెడీ సన్నివేశాలతో నడిపించే ప్రయత్నం చేశారు. అయితే ఫస్టాఫ్ కాస్త స్లోగా ఉంటుంది. ఇంటర్వెల్ లో ఒక ఆసక్తిర సన్నివేశంతో ఆడియన్స్ ని ఎమోషనల్ గా మెప్పించారు. దీనితో సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెరుగుతుంది. అక్కడక్కడా కొన్ని సీన్లు రొటీన్ గా అనిపిస్తాయి. మ్యూజిక్ షాప్ లో జరిగే సన్నివేశాలు కాస్త బోరింగ్ గా ఉంటాయి. 

ఇక ఇక సెకండ్ హాఫ్ మాత్రం మెప్పించే విధంగా సాగుతుంది.దర్శకుడు ఎమోషనల్ సీన్స్ తో కట్టిపడేశారు. క్లైమాక్స్ లో అయితే కన్నీళ్లు తెప్పించే సీన్లు పడ్డాయి. కాస్త ఎమోషనల్ డోస్ ఎక్కువైనప్పటికీ అది కథలో బ్లెండ్ అయిపోతుంది. దీనితో సీన్లు బాగా వచ్చాయి. డీజే గురించి బాగా రీసెర్చ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారని అనిపిస్తోంది. 

నటీనటులు : 

ఈ చిత్రానికి మూల స్థంభం అజయ్ ఘోష్ అనే చెప్పాలి. కమెడియన్ గా, విలన్ గా నటించిన అజయ్ ఘోష్ కి ఈ తరహా క్యారెక్టర్ కొత్త. అయినప్పటికీ ఆయన అద్భుతంగా నటించారు. 50 ఏళ్ళ మిడిల్ క్లాస్ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉంటాయి ? అతడికి డీజేగా మారాలనే కోరిక కలిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి.. ఆ సన్నివేశాల్లో అజయ్ ఘోష్ అద్భుతమైన హావభావాలు పలికించారు. 

చాందిని చౌదరికి కూడా నటనతో మెప్పించింది. ఇక భానుచందర్, ఆమఆమనీ తమ పాత్రల మేరకు చక్కగా నటించారు. అజయ్ ఘోష్ ఎమోషనల్ గా నటించగా.. మోడ్రన్ అమ్మాయిగా చాందిని మెప్పించింది. 

టెక్నికల్ గా : 

దర్శకుడు రాసుకున్న కథ ఈ చిత్రానికి బాగా కుదిరింది. రొటీన్ గా కొన్ని సన్నివేశాలు ఉన్నప్పటికీ మెయిన్ పాయింట్ కి అనుగుణంగా చిత్రాన్ని తెరకెక్కించడంలో డైరెక్టర్ శివ సక్సెస్ అయ్యారు. మ్యూజిక్ షాప్ సెటప్, సినిమాల్లో కనిపించే బ్యాగ్రౌండ్ సెటప్ విషయంలో ఆర్ట్ డిపార్ట్ మెంట్ పనితీరు బావుంది. పాటలు పర్వాలేదు. కానీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బావుంది.

ఓవరాల్ గా :

'మ్యూజిక్ షాప్ మూర్తి'గా అజయ్ ఘోష్ నవ్వించాడు, ఏడిపించాడు.. మొత్తంగా ఆకట్టుకుని అందరిని సర్ప్రైజ్ చేశాడు.  

రేటింగ్ : 2.75

click me!