అల్లు అర్జున్ - జూనియర్ ఎన్టీఆర్ ను మెగా‌- నందమూరి ఫ్యామిలీలు దూరం పెట్టాయా..? కోల్డ్ వార్ కు కారణం ఏంటి..?

First Published Jun 14, 2024, 3:35 PM IST

అల్లు అర్జున్ ను మెగా ప్యామిలీ.. జూనియర్ ఎన్టీఆర్ ను నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టాయా..? వారు కలవడం ఇక కష్టమేనా.. అసలు వీరి మధ్య ఉన్న గ్యాప్ కు కారణం ఏంటి..? ఈ ఇద్దరు హీరోలకు వారి కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా..? 

మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్.. నందమూరి ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్.. గుడ్ బై చెప్పినట్టేనా.. ఈరెండు కుటుంబాలతో.. ఈ ఇద్దరు హీరోలకు ఉన్న విభేదాలు ఏంటి..? అసలు వీరి మధ్య గొడవలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి.. పైకి కనపడకపోయినా.. కలిసి మెలిసి ఉన్న.. వీరి మధ్యలో ఎప్పుడూ కోల్డ్ వార్ జరుగుతూనే ఉందా..?  ఎప్పటికప్పుడు వీరి గురించి చర్చ ఎందుకు జరుగుతుంది. కారణం ఏంటి.. బావా బావా అని పిలిచుకునే బన్నీ - తారక్ లకు ఒకే పరిస్థితి వచ్చిందా..?

ముందుగా అల్లు అర్జున్  పరిస్తితి చూస్తే.. అల్లు అర్జున్ మెగా హీరో అనే బ్రాండ్ నుండి బయటకు  రావాలని చూస్తున్నాడని పెద్ద చర్చ జరుగుతుంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ విషయంలో ఒక్క ట్వీట్ తో విష్ చేసి వదిలిపెట్టిన అల్లు అర్జున్.. తన స్నేహితుడి వైసీపీ అభ్యర్దికోసం ఏకంగా ఆ ఊరికి వెళ్లి ప్రాచరం చేయడం..మెగా ప్యామిలీతో పాటు.. ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోయారు.. ఆతరువాత నాగబాబు ఇండైరెక్ట్ ట్వీట్స్.. గతంలో జరిగినవన్నీ ముందుకు రాడంతో కోల్డ్ వార్.. సోషల్ మీడియా ప్యాన్ వార్ ముదిరిపోయింది. 
 

Allu Arjun

దానికి ఆజ్యం పోసినట్టుగా సాయి దరమ్ తేజ్ బన్నీని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడంతో చర్చ పెద్దది అయ్యింది. గతంలో కూడా ఈ వివాదం నడుస్తూనే ఉంది. రామ్ చరణ్ కు బన్నీకి మొదటి నుంచి పడదని.. దాంతో అల్లు-కొణిదెల ఫ్యామిలీస్ మధ్య దూరం పెరిగిందనే వాదన ఉంది. దువ్వాడ జగన్నాథం ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో అల్లు అర్జున్ సీరియల్ అయ్యాడు. వాళ్ళు పదే పదే పవన్ కళ్యాణ్ పేరు చెప్పాలని గోల చేయడంతో అల్లు అర్జున్ సీరియస్ అయ్యాడు. చెప్పను బ్రదర్ అని అప్పట్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్ పవన్ ఫ్యాన్స్ ని ఆగ్రహానికి గురి చేసింది. 

Allu Arjun

అప్పటి నుండే అల్లు అర్జున్ లో ఒక అసహనం కొనసాగుతుంది. అయినా సరే కొన్ని సందర్భాల్లో  అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి పలుమార్లు మద్దతుగా ఉన్నారు. కలిసినట్టే కలిసి.. దూరం పెంచుకుంటున్నారు. అల్లు అర్జున్ కూడా తన మెగా నీడ నుంచి బయటకు వచ్చి.. అల్లు బ్రాండ్ ను బాగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. నిజానికి మెగాహీరోగా ఎంటర్ అయినా. రామ్ చరణ్ కంటే ముందే బన్నీ తన టాలెంట్ తో సొంత ఇమేజ్ ను బిల్డ్ చేసుకున్నాడు. ఇక ముందు ముందు మెగాతో కలుస్తాడా.. అల్లు నుసపరేట్ బ్రాండ్ చేస్తాడా చూడాలి. 

ఇక ఎన్టీఆర్ తో నందమూరి గొడవ అందరికి తెలిసిందే.  మొదటి నుంచి తారక్ తో నందమూరి, నారా కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. కలినప్పుడు నవ్వుకుంటూ పలకరించుకోవడం.. సందర్భాను సారం వీరి మధ్య గ్యాప్ లు బయటకు తెలిసేలా చేయడం.. చూస్తూనే ఉన్నాం. కొన్ని విషయాల్లో బాలయ్య.. నారా ఫ్యామిలీల వైపు తప్పు కనిపిస్తుంటే.. కొన్ని సదర్భాల్లో ఎన్టీఆర్ చేసిన పనులు కూడా తీవ్రవిమర్శలలకు దారి తీసేలా చేశాయి. 

ntr, balayya

బాలయ్య తారక్ ను దూరం పెట్టారంటూ వాదన విపిస్తుంటుంది. ఆయన అసలు ఎన్టీఆర్ ను పట్టించుకోరని.. కోపంగా ఉన్నారని సోషల్ మీడియా వాదనలు .. కొన్నిసార్లు కలిసినట్టే ఉంటారు.. అంతలో గొడవలు అంటూ మాటలువినిస్తుంటాయి. అరవింద సమేత ఈవెంట్ కు బాలయ్య వెళ్ళారు.. తారకు ను తనతో సమానంగా కొనియాడారు. కాని ఆతరువాత కొన్నిపరిణామాణ వల్ల వీరి మధ్య మళ్లీ గ్యాప్ పెరిగినట్టు తెలుస్తోంది. 

రీసెంట్ గా జరిగిన కొన్ని సంఘటనలు తారక్ పై కాస్త వ్యతిరేకత పెంచేలా ఉన్నాయి.  చంద్రబాబు గెలుపుకు శుభాకాంక్షలు తెలిపిన తారక్ ... ఎక్స్ వేదికగా "ప్రియమైన నారా చంద్రబాబు నాయుడు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పనిలో పనిగా లోకేష్, బాలయ్య, పురందరేశ్వరి, భరత్ లన కూడా విష్ చేశారు. ఈ పోస్ట్ కు బాబు కూడా సాలిడ్ రిప్లై ఇచ్చారు. ఒకే ఒక ముక్కలో థాంక్యూ అమ్మ అంటూ సమాధానమిచ్చారు. 

ఇక్కడే అసలు విషయాన్ని సోషల్ మీడియాలో చర్చించుకున్నారు ఫ్యాన్స్. అధికారంలో లేనప్పుడు, రాష్ట్రంలో అష్ట కష్టాలు పడినప్పుడు, భువనేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలతో అవమానాలకు గురి చేసినప్పుడు, చంద్రబాబును జైలుకు పంపించినప్పుడు కూడా ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడని, కనీసం మద్దతుగా ఒక పోస్ట్ కూడా పెట్టని జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పోస్ట్ పెట్టడంపై విమర్శలు వచ్చాయి.

అంతే కాదు ప్రమాణ స్వీకారానికి తారక్ హాజరు కాకపోవడం.. పవన్ ప్రమాణానికి బాబాయి కోసం రామ్ చరణ్ రావడంతో.. ఈ కోణంలో కూడా తారక్ ను విమర్శిస్తున్నారు. దాంతో తారక్ నందమూరి‌-నారా కుటంబాలకు ఇంకా దూరం అవుతున్నారా అన్న వాదన వినిపిస్తోంది. ముందు ముందు పరిణామాలు మారి.. అందరు కలుస్తారన్న ఆశ ఫ్యాన్స్ లో ఉంది.. అటు అల్లు అర్జున్ విషయంలో కూడా ఫ్యాన్స్ కు ఈ ఆశే ఉంది. అయితే  వీరి మధ్య అంత సీరియస్ గొడవలు ఉన్నాయా..? నిజంగా బన్నీ తారక్ లు మెగా నందమూరి బ్రాండ్ నుంచి బయటకు రావాలని చూస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. 
 

Latest Videos

click me!