యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. కల్కి 2898 AD సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ కు .. బాహుబలి తరువాత కల్కి సినిమానే అంతటి విజయాన్ని అందించింది. కాగా ఈసినిమాలో ప్రతీ పాత్ర అద్భుతంగా పండింది.
కమల్ హాసన్ కాని.. అమితాబ్ కాని అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించారు. అయితే అమితాబ్ కల్కి సినిమాలో ఏడడుగుల అశ్వత్థామపాత్రలో నటించి ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నారు. అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ ఎంతగా ఒదిగిపోయారు. ద్వాపర యుగం నాటి పాత్రఇది కావడంతో అందరు అమితాబ్ ను ఆసక్తిగా గమనించారు.
Poll: ఈ వారం బిగ్ బాస్ హౌౌజ్ నుంచి ఎగ్జిట్ అయ్యేది ఎవరు?
అంతే కాదు కల్కి సినిమాలో మిగిలిన అన్ని పాత్రల కంటే ఎత్తులో ఉన్నా అమితాబ్ 7 అడుగుల ఎత్తులో కనిపిస్తారు.ఆ పాత్ర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకర్షించింది. అయితే అమితాబ్ ను ఉన్న ఎత్తుకుంటే ఎక్కువగా ఎలా చూపించారు అని చాలామంది సందేహం.
కొం తమందిమాత్రం ఇదంతా గ్రాఫిక్ మాయాజాలం అనుకున్నారు. కానీ నిజంగానే అంత ఎత్తున్న ఆర్టిస్ట్ ఆ పాత్రను చేశారు అని మీకు తెలుసా..? వింటానికి వచిత్రంగా ఉన్నా.. 7 అడుగులు పైన ఉన్న ఆమనిషి అమితాబ్ కు డూప్ గా నటించాడని మీకు తెలుసా..? ఇంతకీ ఇందులో అమితాబచ్చన్‌కి డూప్‌గా చేసింది ఎవరో కాదు జమ్మూ కశ్మీర్‌కు చెందిన సునీల్ కుమార్.
దారుణమైన పరిస్థితుల్లో నటుడు ఫిష్ వెంకట్..?
ఎత్తు ఏడు అడుగులు ఏడు అంగుళాలు. జమ్మూలోని పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నారాయన. సినిమాలపై ఉన్న ఆసక్తితో ప్రయత్నాలు చేశారు. కల్కి సినిమాతోపాటు పలు హిందీ సినిమాల్లో అవకాశం అందుకున్నారు. తాజాగా విడుదలై బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సంచలన చిత్రం 'స్త్రీ 2’ లో కూడా సునీల్ కుమార్ నటించాడు.
స్త్రీ2 లో సునిల్ కుమార్ ఓ దెయ్యం పాత్రలోకినిపించి అలరించారు. ఇక తాజాగా హీరోయిన్ శ్రద్దా కపూర్ తో సునీల్ కుమార్ తీసుకున్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశారాయన. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం వరుసగా చిత్రాల్లో నటిస్తున్న సునీల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'కల్కి సినిమా అనుభవాలను పంచుకున్నాడు.
1000 రోజులు ఆడిన బాలయ్య ఏకైక సినిమా
చిన్నప్పటి నుంచి నేను అమితాబ్ సర్ ఫ్యాన్. నేను మాత్రమే కాకుండా నా కుటుంబ సభ్యులు మొత్తం అమితాబ్ జీ ఫాన్సే. అలాంటి అమిత్‌జీ కి డూప్‌గా నటించాలి అన్నప్పుడు సర్‌ప్రైజ్ అయ్యాను. కల్కి సినిమా సెట్స్‌లో మొదటి రోజు అడుగు పెట్టిన విషయం ఎప్పటికి మరచి పోలేను. ప్రభాస్, అమితాబ్ గారు కలిసి కూర్చుని ఉన్నారు.
నన్ను చూడగానే నా వద్దకు వచ్చి మాట్లాడారు. ఆ రోజును నేను ఎప్పటికీ మరచిపోలేను. కల్కి సినిమా కోసం పలు యాక్షన్ సన్నివేశాల్లో నేను నటించాను. చాలా రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొనే అవకాశం దక్కింది’’ అని చెప్పారు.
రజనీకాంత్ కూలీ సినిమా కోసం నాగార్జున షాకింగ్ రెమ్యునరేషన్..?
ఇక ప్రభుత్వ ఉద్యోగి కావడంతో.. సినిమా షూటింగ్ కోసం వరుసగా సెలవు పెట్టి ముంబయి నుంచి హైదరాబాద్ తిరగడం చాలా కష్టం అయ్యిందట సునిల్ కు. ఎంత కష్టం అయినా.. తనకు నటించడం ఇష్టం కావడంతో వాటిని భరించాను అంటున్నారు సునిల్ కుమార్.