ఏఎన్నార్ తల్లికి వచ్చిన భయంకరమైన కల..అదే సెంటిమెంట్ నాగ చైతన్యకి కూడా, అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఇలా

First Published | Sep 6, 2024, 3:03 PM IST

తల్లి దండ్రులు వాళ్ళ అభిరుచికి తగ్గట్లుగా పిల్లలకు పేర్లు పెడుతుంటారు. కానీ అక్కినేని ఫ్యామిలిలో పేర్ల వెనుక ఒక బలమైన సెంటిమెంట్ ఉందట. నాగేశ్వర రావు ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. 

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు మూలస్థంభాలు లాంటి నటుల్లో ఒకరు అక్కినేని నాగేశ్వర రావు. ఏఎన్నార్ తర్వాత ఆయన కుటుంబ సభ్యులు నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. నాగార్జున టాలీవుడ్ స్టార్ హీరోగా దశాబ్దాలు రాణించారు. ఇప్పుడు ఆయన కుమారులు నాగ చైతన్య, అఖిల్ నటులుగా రాణించే ప్రయత్నం చేస్తున్నారు. 

లెజెండ్రీ యాక్టర్ ఏఎన్నార్ తన ఫ్యామిలీ గురించి చెబుతూ గతంలో ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఆసక్తిగా మారాయి. తల్లిదండ్రులు వాళ్ళ అభిరుచికి తగ్గట్లుగా పిల్లలకు పేర్లు పెడుతుంటారు. కానీ అక్కినేని ఫ్యామిలిలో పేర్ల వెనుక ఒక బలమైన సెంటిమెంట్ ఉందట. నాగేశ్వర రావు ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. 


అక్కినేని ఫ్యామిలిలో చాలా మంది పేర్లు నాగ అనే పదంతో మొదలవుతాయి. నాగేశ్వర రావు, నాగార్జున, నాగ సుశీల, నాగ చైతన్య ఇలా చాలా మంది పేర్లలో నాగ అని ఉంటుంది. దీని గురించి ఏఎన్నార్ వివరించారు. మా అమ్మకి నన్ను ప్రసవించిన రోజునే ఒక కల వచ్చిందట. తన చుట్టూ నాగుపాము తిరుగుతున్నట్లు కలలో కనిపించిందట. దీనితో ఆమె నాగ దేవతగా భావించి..నాకు నాగేశ్వర రావు అని పేరు పెట్టింది. 

ఆ తర్వాత నా భార్య ఆ సెంటిమెంట్ కంటిన్యూ చేసింది. మా కుమార్తెకి నాగ సుశీల అని పేరు పెట్టింది. నాగార్జునకి మాత్రం నేనే పేరు పెట్టాను. అప్పట్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుండేది. దాని మీద నాకు ఇష్టం ఉంది. నాగ అనే సెంటిమెంట్ కూడా కలిసి వస్తుంది కాబట్టి నాగార్జున అని పేరు పెట్టినట్లు ఏఎన్నార్ తెలిపారు. ఆ తర్వాత నాగ చైతన్య వరకు ఆ సెంటిమెంట్ కొనసాగింది అని ఏఎన్నార్ అన్నారు. 

ఏఎన్నార్ చివరగా నాగార్జున, నాగ చైతన్యతో కలసి మనం చిత్రంలో నటించారు. మనం చిత్రం క్లాసిక్ మూవీ గా నిలిచిపోయింది. ఈ చిత్ర రిలీజ్ కి కొన్ని నెలల ముందే ఏఎన్నార్ మరణించారు. 

Latest Videos

click me!