భరణిని కావాలనే ఎలిమినేట్ చేయించారా, కారణం అదే ? దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

Published : Oct 22, 2025, 04:41 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో జరిగిన భరణి శంకర్ ఎలిమినేషన్ చర్చనీయాంశంగా మారింది. భరణిని కావాలనే టార్గెట్ చేసి ఎలిమినేట్ చేయించారు అనే ప్రచారం ఉంది. దీనిపై దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

PREV
15
భరణి ఎలిమినేషన్ తో కొత్త మలుపు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజు రోజుకి రసవత్తరంగా మారుతోంది. దీపావళి ఎపిసోడ్ సండే రోజున బిగ్ బాస్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. టాప్ 5 లో ఉంటాడనుకున్న భరణిని ఎలిమినేట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. వైల్డ్ కార్డు సభ్యులు ఎంట్రీ ఇచ్చాక భరణి ఎలిమినేషన్ జరిగింది. దీనితో భరణి ఎలిమినేషన్ గురించి చాలా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. భరణిని కావాలనే ఎలిమినేట్ చేశారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

25
బెదిరించి భరణిని ఎలిమినేట్ చేయించింది అతడేనా ?

ప్రస్తుతం దివ్వల మాధురి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా హౌస్ లో ఉన్నారు. ఆమెకి భరణి దగ్గరవుతున్నారనే ఉద్దేశంతో.. దువ్వాడ శ్రీనివాస్ బెదిరించి భరణిని ఎలిమినేట్ చేయించారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇదే ప్రశ్న దువ్వాడ శ్రీనివాస్ కి ఓ ఇంటర్వ్యూలో ఎదురైంది. భరణి, మాధురికి దగ్గరవుతున్నారు అనే ఉద్దేశంతోనే శ్రీనివాస్ ఇలా చేయించారు అంటూ ప్రచారం ఉంది.. దీనిపై మీ స్పందన ఏంటి ? అని యాంకర్ ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు.

35
దువ్వాడ శ్రీనివాస్ రియాక్షన్

దువ్వాడ శ్రీనివాస్ సమాధానం ఇస్తూ.. అది పూర్తిగా అవాస్తవం. ఎవడో చదువులేని మూర్ఖుడే ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారు. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో ఊహించుకుని కామెంట్స్ చేసే వాడి బుద్ధి కూడా అలాగే ఉంటుంది. అలాంటి కామెంట్స్ గురించి చర్చించుకోవడమే అనవసరం. అయితే భరణి విషయానికి వస్తే.. ఆయన చాలా బాగా ఆడారు. కానీ ఆయన చేసిన మిస్టేక్ ఒకటి ఉంది. గేమ్ పై ఫోకస్ చేయకుండా బంధాల్లో ఇరుక్కుపోయారు.

45
భరణి టాప్ 5 లో ఉండేవారు

బంధాల వల్లే భరణిగారికి నష్టం జరిగింది. లేకపోతే భరణి గారు తప్పకుండా టాప్ 5 కి వెళ్లేవారు. ఆయన టాప్ 5 లో ఉంటారని నేను కూడా భావించాను అని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. మాధురి హౌస్ లో ఉండడానికి, భరణి ఎలిమినేషన్ కి ఎలాంటి సంబంధం లేదని దువ్వాడ శ్రీనివాస్ తేల్చేశారు.

55
తనూజ, దివ్యతో ఎమోషనల్ బాండింగ్

తనూజ భరణిని తండ్రిగా భావించింది. ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. అదే విధంగా భరణి, దివ్య మధ్య కూడా ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఈ బంధాల వల్ల భరణి గేమ్ పని సరిగ్గా ఫోకస్ పెట్టలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. పెర్ఫార్మెన్స్ తగ్గుతూ రావడంతో భరణి ఎలిమినేట్ అయ్యారు.

Read more Photos on
click me!

Recommended Stories