చావు బ్రతుకుల్లో నిర్మాత, ఆసుపత్రులన్నీ చేతులెత్తేశాయి.. చిరంజీవి ఒక్కరే ఏం చేశారో తెలుసా

Published : Oct 22, 2025, 03:20 PM IST

చిరంజీవి చొరవతో ఒక అగ్ర నిర్మాత ప్రాణాలు నిలబడ్డాయి. ఆ నిర్మాత చిరంజీవితో ఒక్క సినిమా కూడా చేయలేదు. తాను జీవితాంతం చిరంజీవి గారికి రుణపడి ఉంటానని ఆ నిర్మాత అన్నారు. 

PREV
15
చిరంజీవి సేవా గుణం 

మెగాస్టార్ చిరంజీవి ఎవరు ఆపదలో ఉన్నా సాయం చేయడానికి ముందుంటారు. సేవా గుణంలో చిరంజీవికి సాటి రారు అని ఇండస్ట్రీలో చాలా మంది చెబుతుంటారు. భయంకర కరోనా పరిస్థితుల్లో చిరంజీవి ఒక ఉద్యమంలా ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఒకరు ఇటీవల ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ నిర్మాత చిరంజీవితో ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినప్పటికీ అతడు చావు బతుకుల్లో ఉండగా చిరంజీవి ఆపద్బాంధవుడిలా ఆదుకున్నారట. 

25
రెండోసారి కరోనా రాదనుకున్నా 

ఇంతకీ ఆ నిర్మాత ఎవరో కాదు బండ్ల గణేష్. గబ్బర్ సింగ్, బాద్షా, ఇద్దరమ్మాయిలతో టెంపర్ లాంటి చిత్రాలని బండ్ల గణేష్ నిర్మించారు. కోవిడ్ సమయంలో ఆల్రెడీ ఒకసారి బండ్ల గణేష్ కరోనా నుంచి కోలుకున్నారు. కానీ రెండవసారి కూడా బండ్ల గణేష్ కి కరోనా వచ్చింది. చాలా బలంగా ఈసారి ప్రభావం చూపించింది అని బండ్ల గణేష్ తెలిపారు. లంగ్స్ దాదాపుగా పాడయ్యాయి. నేను చేసిన తప్పు ఏంటంటే.. ఒకేసారి కరోనా వచ్చినవారికి రెండవసారి రాదు అని పొరపాటుగా భావించడమే. దీనితో ఎక్కువరోజులు నిర్లక్ష్యం చేశాను. 

35
ఆసుపత్రులన్నీ చేతులెత్తేశాయి 

నా పరిస్థితి బాగా విషమించింది. ఏ ఆసుపత్రుకి ఫోన్ చేసినా రూమ్స్ ఖాళీగా లేవు అని చేతులెత్తేశారు. నాకు నోట మాట రావడం లేదు. పరిస్థితి దిగజారుతోంది. అపోలో ఆసుపత్రి డాక్టర్ సుబ్బారెడ్డి గారికి ఫోన్ చేశా. పెద్ద పెద్ద వాళ్లందరికీ రూమ్స్ బుక్ అయిపోయాయి సార్.. ఏమీ చేయలేం అని ఆయన కూడా చేతులెత్తేశారు. పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేద్దాం అంటే ఆయన కూడా కరోనాతో బాధపడుతున్నారు. 

45
చిరంజీవి గారికి ఫోన్ చేస్తే.. 

నా పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక్క రోజు ఆలస్యం అయినా చనిపోయేవాడిని. ఏం చేయాలో అర్థం కాలేదు. చిరంజీవి గారి మేనేజర్ కి ఫోన్ చేశా. ఫోన్ ఎత్తలేదు. డైరెక్ట్ గా చిరంజీవి గారికే ఫోన్ చేశా.. ఫస్ట్ రింగ్ కే ఫోన్ ఎత్తారు. అన్నా ఇదీ నా పరిస్థితి అని చెప్పా. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఫోన్ పెట్టేశారు. 2 నిమిషాల్లో నాకు చిరంజీవి గారు తిరిగి కాల్ చేశారు. డైరెక్ట్ గా అపోలో ఆసుపత్రికి వెళ్ళు అని చెప్పారు. ఆసుపత్రికి వెళ్లేసరికి నా కోసం 10 మంది డాక్టర్లు ఎదురుచూస్తున్నారు. ఎమెర్జెన్సీ టెస్టులన్నీ చేశారు. వెంటనే రెమ్డిసివిర్ ఇంజక్షన్ ఇచ్చారు. 

55
ఒక్క రోజు ఆలస్యం అయితే చనిపోయేవాడిని 

80 శాతం లంగ్స్ పాడయ్యాయి అని, ఒక్క రోజు ఆలస్యం అయి ఉంటే చనిపోయేవారు అని డాక్టర్లు నాతో చెప్పారు. ఆ తర్వాత 3 రోజులు ఐసీయూ లో నాకు చికిత్స అందించారు. నాకు ఏం జరుగుతుందో తెలియదు. కోలుకున్న తర్వాత నాకు చెప్పింది ఏంటంటే నా కోసం చిరంజీవి గారు 100 సార్లు ఆసుపత్రికి ఫోన్ చేసి ఫాలో అప్ చేశారట. కోలుకునే వరకు నా ఆరోగ్యం గురించి తెలుసుకుంటూనే ఉన్నారట. నేను కోలుకున్న తర్వాత చిరంజీవి గారు నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టారు. అంత సీరియస్ అయ్యే వరకు ఎందుకు నిర్లక్ష్యం చేశావురా అని అడిగారు. చిరంజీవి గారు నా ప్రాణాలు కాపాడిన దేవుడు. అలాంటి మనిషికి కృతజ్ఞత చూపించకుంటే నాది మనిషి జన్మ కాదు అని బండ్ల గణేష్ తెలిపారు. ఇటీవల దీపావళి సందర్భంగా బండ్ల గణేష్ టాలీవుడ్ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా సెలెబ్రేషన్స్ నిర్వహించారు. చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరంజీవి కోసం బండ్ల గణేష్ ప్రత్యేకమైన సింహాసనం తయారు చేయించారు. చిరంజీవి రాగానే ఆయనకి స్వాగతం పలికి సింహాసనంలో కూర్చోబెట్టారు. ఆ క్షణం తన మనసు సంతోషంతో ఉప్పొంగి పోయింది అని బండ్ల గణేష్ పేర్కొన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories