విడాకుల రూమర్స్ మధ్య... పేరు మార్చుకున్న హన్సిక , కారణం ఏంటి?

Published : Oct 22, 2025, 03:37 PM IST

భర్త సోహైల్ ఖతురియాతో మనస్పర్థల కారణంగా విడిపోతున్నారనే వార్తల మధ్య, నటి హన్సిక ఇప్పుడు తన పేరును కూడా మార్చుకున్నట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంలో నిజం ఎంత? 

PREV
16
చైల్డ్ ఆర్టిస్ట్ గా హన్సిక

హిందీలో బాలనటిగా  తన కెరీర్ స్టార్ట్ చేసింది హన్సిక. బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు రాకపోవడంతో, సౌత్ సినిమాల్లో ఛాన్సుల కోసం వెతుకుతున్నప్పుడు తెలుగులో అవకాశం వచ్చింది. అల్లు అర్జున్‌కు జోడీగా దేశముదురు సినిమాతో టాలీవుడ్ లోకెరీర్ స్టార్ట్ చేసింది హన్సిక. ఆ తర్వాత హిందీ, కన్నడ భాషల్లో హీరోయిన్‌గా చేసింది.

26
తెలుగు నుంచి తమిళంలోకి

తెలుగులో వరుసగా యంగ్ హీరోలతో నటిస్తున్న ఆమెను... తమిళంలో హీరోయిన్‌గా పరిచయం చేసింది దర్శకుడు సురాజ్. ధనుష్ హీరోగా తీసిన 'మాప్పిళ్ళై' సినిమాతో ఆమె కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. . మొదటి తమిళ సినిమాతోనే తన  అందంతో కోలీవుడ్  ఆడియన్స్ ను  ఆకట్టుకుంది. ఫ్యాన్స్ ఆమెను 'చిన్న కుష్బూ' అని పిలిచేవారు. ఆ తర్వాత 'ఎంగేయుమ్ ఎప్పోదుమ్', విజయ్‌తో 'వేలాయుధం' వంటి సినిమాల్లో టాప్ హీరోలతో నటించింది. తమిళ ఫ్యాన్స్ హన్సికు ఏకంగా గుడి కట్టేశారు. 

36
శింబుతో ప్రేమ

స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న టైంలోనే, నటుడు శింబుతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి. వీరు పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ 3 నెలల్లోనే వాళ్ల ప్రేమకు బ్రేకప్ పడింది. ప్రేమ విఫలమయ్యాక, మళ్లీ తమిళ సినిమాలపై హన్సిక దృష్టి పెట్టింది.

46
స్నేహితురాలి మాజీ భర్తతో పెళ్లి

కొన్ని సంవత్సరాల తర్వాత, తన స్నేహితురాలి మాజీ భర్త, వ్యాపారవేత్త అయిన సోహైల్ ఖతురియాతో ప్రేమలో పడింది హన్సిక. వీరిద్దరూ 2022లో పెళ్లి చేసుకున్నారు. ఆతరువాత ఆమె పెద్దగా సినిమాలు చేయలేదు. 

56
విడాకుల వివాదం

పెళ్లయి మూడేళ్లు కూడా కాకముందే, సోహైల్ ఖతురియాతో మనస్పర్థల వల్ల విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపించాయి. దీన్ని నిజం చేస్తూ హన్సిక తన భర్తతో దిగిన ఫోటోలను సోషల్ మీడియా నుంచి తీసేసింది. వినాయక చవితి, దీపావళి వంటి పండుగలను ఇద్దరూ వేర్వేరుగా జరుపుకున్నారని టాక్.

66
పేరు మార్చుకున్న హన్సిక

హన్సిక విడాకుల వివాదం ఒకవైపు నడుస్తుండగా, ఆమె సడెన్ గా తన పేరు మార్చుకుంది. ఇంగ్లీషులో "Motwani"ని ఇప్పుడు "Motwanni"గా మార్చింది. అయితే  ఈ మార్పుకు కారణం ఏంటీ అనేది ఆమె వెల్లడించలేదు. కానీ సోషల్ మీడియాలో  ఆమె ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో కారణం ఏంటీ అని ఆమెను అడుగుతున్నారు. సినిమా అవకాశాలు లేకపోవడంతో, న్యూమరాలజీ ప్రకారం పేరు మార్చుకుని ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories