'హనుమాన్' లాభాలను ‘డబుల్ ఇస్మార్ట్’ ఊడ్చేస్తోంది

First Published | Aug 20, 2024, 12:26 PM IST

హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి ...పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart)టోటల్ రైట్స్ ని తీసుకున్నారు. 

Double Ismart Ram Pothinenis


ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ సినిమా భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన రిలీజైన ఈ సూపర్ హీరో చిత్రం అంచనాలను మించి సుమారు రూ.330 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. థియేటర్లలో లాంగ్ రన్ సాధించి దుమ్మురేపింది. ఓటీటీల్లోనూ హనుమాన్ చిత్రం హవా చూపించింది. వారాల పాటు ట్రెండింగ్‍లో టాప్‍లో నిలిచి రికార్డుస్థాయి వ్యూస్ సాధించింది.  ఇలా అన్ని చోట్లా హనుమాన్ దుమ్ము రేపి నిర్మాతలకు లెక్కకు మించి సంపాదించి పెట్టింది. అయితే అదే నిర్మాత ఇప్పుడు ఆ డబ్బు ని వేరే సినిమాలపై పెట్టుబడి పెట్టారు. ఆ సినిమాలు మాత్రం కలిసి రాలేదు.


ఇక హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి ...పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart)టోటల్ రైట్స్ ని తీసుకున్నారు. అయితే ఆ చిత్రం భాక్సాఫీస్ దగ్గర చీదేసింది.  పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)  ,రామ్ (Ram) కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’  (iSmart Shankar) కి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart)  రూపొందింది. కావ్య థాపర్ (Kavya Thapar) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్  (Sanjay Dutt) విలన్ గా నటించాడు. టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మణిశర్మ (Mani Sharma)   సంగీతంలో రూపొందిన పాటలు కూడా సినిమా హైప్ కి పనికొచ్చాయి.    ఆగస్టు 15న(నిన్న) రిలీజ్ అయిన ఈ సినిమా మార్నింగ్ షో నుంచి నెగిటివ్ టాక్ మూట కట్టుకుంది. 

Latest Videos


Ali, Double iSmart


 డబుల్ ఇస్మార్ట్   చూసిన ఆడియన్స్ చాలా మంది సినిమాలో  ఆలీ కామెడీ ట్రాక్ చాలా రోతగా అనిపించింది. ఆ ట్రాక్  మొత్తాన్ని ఎంత వీలయితే అంత త్వరగా డిలేట్ చేస్తే సినిమాకి ఎంతో కొంత బెటర్ ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చే అవకాశం ఉంటుంది అని చాలా మంది అభిప్రాయపడ్డారు.మరో ప్రక్క  మిస్టర్ బచ్చన్ మూవీ టీమ్ ...టాక్ తేడాగా ఉందనగానే  వెంటనే స్పందించి 13 నిమిషాల ఫుటేజ్ ను కూడా డిలేట్ చేశారు, కానీ డబుల్ ఇస్మార్ట్ మూవీ టీం మాత్రం ఎవ్వరి ఫీడ్ బ్యాక్ ను పట్టించు కోలేదు, ఆలీ సీన్స్ ను అలానే ఉంచారు…. దాంతో లాంగ్ ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో ఎంతో కొంత గ్రోత్ ని అయినా చూపిస్తుంది అనుకున్న డబుల్ ఇస్మార్ట్ కంప్లీట్ గా దెబ్బ పడిపోయింది.


 బాక్స్ ఆఫీస్ దగ్గర మీడియం రేంజ్ మూవీస్ పరంగా ఇప్పుడు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలుస్తోంది. ఈ క్రమంలో ఈ చిత్రం రైట్స్   అన్ని లాంగ్వేజ్ ల థియేటర్ రైట్స్ ఏకమొత్తంగా తీసుకున్న నిరంజన్ రెడ్డి కు పెద్ద దెబ్బే తగిలినట్లు అయ్యింది. 49 కోట్ల రూపాయలు ఈ రైట్స్ నిమిత్తం పే చేసినట్లు తెలుస్తోంది. అది కూడా నాన్ రిఫండబుల్ ఎమౌంట్. అంటే పూరి జగన్నాథ్ రూపాయి వెనక్కి ఇవ్వక్కర్లేదన్నమాట. అయితే ఇప్పుడు సినిమా డిజాస్టర్ అవ్వటంతో దాదాపు 40 కోట్లు దాకా పోగొట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఆర నెలల్లో హనుమాన్ మీద సంపాదించిన సొమ్ము ఇలా వెనక్కి వెళ్లిపోతోదంటోంది ట్రేడ్.

Double iSmart


అలాగే ఇదే నిర్మాత ప్రియదర్శితో డార్లింగ్ సినిమా చేసారు. ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. ఇక నిరంజన్ రెడ్డి వరసగా శ్రీవిష్ణు, నితిన్, సాయి ధరమ్ తేజలతో సినిమా చేయబోతున్నారు. డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో డిస్ట్రిబ్యూషన్ లోకి కూడా వచ్చారు. అయితే ఈ సినిమాతో స్పీడ్ బ్రేకర్ పడినట్లు అయ్యింది. అయితే నిరంజన్ రెడ్డి మరింత జాగ్రత్తగా రాబోయే ప్రాజెక్టులు హిట్ కొట్టే దిశగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

click me!