ఇక ఇలాంటి టెంపర్ పాత్రలు చేయాలి అంటే బాలయ్య తరువాతే ఎవరైనా..? నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలు ఆయన పెద్దగా చేయలేదు కాని... ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన మూవీస్ లో కోపంతో బాలకృష్ణ ఊగిపోతుంటే.... ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేసేవారు. సమరసింహారెడ్డ , నరసింహనాయుడు దగ్గర నుంచి..నిన్న మెన్నటి వీరసింహారెడ్డి వరకూ.. బాలయ్య బాబు కోపంతో రగిలిపోయే పాత్రలు చాలా చేశాడు. ప్రత్యర్ధులకు కటిచూపుతో చిచ్చుపోంచే పాత్రను ఆయన ఫ్యాన్స్ అద్భుతంగా ఆదరిస్తుంటారు.