మరో ప్రక్క నిర్మాత అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) కూడా స్పందించారు. ఒక సినిమాను సమీక్షించడం లేదా విమర్శించడం మంచిదేనని, కానీ మాట్లాడే మాటలు సరైనవిగా ఉండాలన్నారు. ‘‘మాస్ ప్రేక్షకులు మెచ్చిన చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లు వసూలు చేసింది.. ప్రేక్షకులతో ప్రేమగా ‘డార్లింగ్’ అని పిలిపించుకునే నటుడు చేసిన మూవీకి ‘జోకర్’ అనే ముద్రవేశారు. సినిమాను రివ్యూ చేయొచ్చు లేదా విమర్శించవచ్చు. కానీ, మిస్టర్ అర్షద్ వార్సీ మాట్లాడిన మాటలు నిర్మాణాత్మకమైన విమర్శలుగా లేవు. కొంచెం ఆలోచించి మాట్లాడి ఉంటే బాగుండేది. ప్రభాస్ గారిపై దాడి చేయడం కన్నా ఆయన తన కెరీర్‌పై దృష్టి పెడితే మంచిది. అంతేకాదు, భారతీయ సినిమా మరింత అభివృద్ధి చెందేలా ఏం చేయాలో చెబితే బాగుంటుంది’’