మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వరించిన విషయం తెలిసిందే. ఇండియన్ సినిమాలో మోస్ట్ ప్రొలిఫిక్ యాక్టర్‌గా, డాన్సర్‌గా ఆయన ఈ రికార్డు సృష్టించారు. 156 సినిమాల్లో 537 పాటలు, 24000 డాన్స్ మూమెంట్స్ కి గానూ ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు వరించడం విశేషం. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన నటుడు మరెవ్వరూ లేరని చెప్పొచ్చు. దీంతో మెగాస్టార్ పేరుతో మరో రికార్డు నమోదు అయ్యింది.
బిగ్ బాస్ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
Chiraneevi
చిరంజీవికి గిన్నిస్ రికార్డు రావడానికి, ఆయన జననానికి, సినిమా కెరీర్‌కి ఒక సంబంధం ఉంది. మరెవ్వరికీ సాధ్యం కాని విధంగా ఆయనకు మాత్రమే ప్రత్యేకంగా భావించే అంశాలున్నాయి. మరి ఆ అంశాలేంటి? గిన్నిస్ వరల్డ్ రికార్డుకి, చిరంజీవికి ఉన్న సంబంధం ఏంటనేది చూస్తే, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుని 1955లో స్థాపించారు. ఆగస్ట్ లోనే దాన్ని లాంచ్ చేశారు. సరిగ్గా అదే ఏడాది ఆగస్ట్ లోనే చిరంజీవి జన్మించారు. కొణిదెల శివశంకర వర ప్రసాద్‌గా చిరంజీవి 1955 ఆగస్ట్ 22న జన్మించిన విషయం తెలిసిందే.
అంతేకాదు మరో షాకింగ్ లింక్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి చిత్రం `ప్రాణం ఖరీదు` సినిమా 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. అంటే చిరంజీవి వెండితెరకి పరిచయమైన రోజు అది. సరిగ్గా అదే రోజు అంటే సెప్టెంబర్ 22(2024) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఆయన్ని వరించింది. ఇలా ఈ రెండు రకాలుగా ఆయనకు ఈ ప్రతిష్టాత్మక రికార్డు దక్కడం యాదృశ్చికమైనా, చాలా ప్రత్యేకంగా నిలిచిందని చెప్పొచ్చు. అంతేకాదు ఇదే ఏడాది ఇటీవల ఆయనకు భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ కూడా వరించిన విషయం తెలిసిందే. ఇక ఆయనకు దక్కని అవార్డులంటూ లేవని చెప్పొచ్చు.
చిరంజీవికి ఇప్పటికే పద్మ విభూషణ్‌తోపాటు పద్మ భూషణ్ పురస్కారాలు వరించాయి. అలాగే ఈఫీలో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. రఘుపతి వెంకయ్య అవార్డు వరించింది. 9 ఫిల్మ్ ఫేర్‌అవార్డులు, నాలుగు నంది పురస్కారాలు దక్కాయి. ఆంధ్రయూనివర్సిటీ డాక్టరేట్‌తోనూ గౌరవించింది. ఇలాంటి అరుదైన రికార్డులు ఆయన చెంత చేరాయి. కానీ జాతీయ అవార్డులు రాలేదు. ఆయన నటించిన చిత్రాలకు జాతీయ అవార్డులు వచ్చాయి. ఇక ప్రస్తుతం మెగాస్టార్ `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. త్రిష హీరోయిన్. వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. సోషియా ఫాంటసీగా ఈ మూవీ రూపొందుతుంది. వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.