బాలీవుడ్ లో క్రేజీ నటుడిగా రాణిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గురించి పరిచయం అవసరం లేదు. ఇటీవల సైఫ్ సౌత్ చిత్రాలలో కూడా నటిస్తున్నాడు. ఆ మధ్యన ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంలో రావణుడిగా నటించాడు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా చిత్రం దేవరలో విలన్ గా నటించాడు. సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ లో అపర కుబేరుడు. ఆయన ఆస్తి కొన్ని వేల కోట్లు ఉంటుంది అనే సంగతి తెలిసిందే.
సైఫ్ అలీ ఖాన్ ది నవాబుల వంశం. వారసత్వంగా సైఫ్ లో వేల కోట్ల ఆస్తులు వచ్చాయి. సైఫ్ తండ్రి మన్సూర్ అలీ ఖాన్ అప్పట్లో క్రికెటర్ గా రాణించారు. వారసత్వంగా తండ్రి నుంచి సైఫ్ పటౌడీ ప్యాలెస్ వచ్చింది. పటౌడీ ప్యాలెస్ విలువ 800 కోట్లు ఉంటుంది.
అయితే సైఫ్ అలీ ఖాన్ ఈ ప్యాలెస్ ని మ్యూజియం కోసం అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వచ్చాయి. దీనితో సైఫ్ అలీ ఖాన్ సరదాగా స్పందించారు. ఏంటి నాకు తెలియకుండా నా ప్యాలెస్ ని అమ్మేస్తున్నారా అని ఆశ్చర్యపోయాడు. అలా ఎప్పటికీ జరగదు అని సైఫ్ అలీ ఖాన్ తెలిపాడు. ఆ ఇంటికి నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది అని తెలిపారు.
మా నాన్న, తాత, నానమ్మ అందులో వారికి ఇష్టం వచ్చినట్లు బతికారు. కాలం మారిన తర్వాత ఈ ప్యాలెస్ ని హోటల్ గా మార్చితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. అలాంటి పిచ్చి పనులు చేయకు. ఈ ఇంటికి ఒక గౌరవం ఉంది అని నానమ్మ నాకు వార్నింగ్ ఇచ్చింది. అప్పటి నుంచి సైఫ్ ఆ ఆలోచన విరమించుకున్నాడు.
ఈ ప్యాలెస్ మొత్తం 10 ఎకరాల విస్తీరణంలో ఉంటుంది. ప్యాలెస్ మొత్తం 150 గదులు ఉంటాయి. సైఫ్ ఫ్యామిలీ ఈ ప్యాలెస్ ని వెకేషన్ కోసం ఉపయోగిస్తుంటారు. అదే విధంగా ఈ ప్యాలెస్ లో షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి. సందీప్ రెడ్డి వంగా యానిమల్ చిత్ర షూటింగ్ కూడా ఈ ప్యాలెస్ లోనే జరిగింది.