తెలుగులో రచ్చ చేసింది, కన్నడ బిగ్ బాస్ లోకి శోభా శెట్టి ఎంట్రీ.. ఆమె సంగతి తెలిసి ముఖం మీదే అడిగేసిన హీరో 

First Published | Nov 18, 2024, 2:26 PM IST

కన్నడ బిగ్ బాస్ లో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీలు అవసరం అయ్యాయి. తెలుగు బిగ్ బాస్ లో రాణించిన క్రేజీ బ్యూటీ శోభా శెట్టి తాజాగా కన్నడ బిగ్ బాస్ సీజన్ 11లో వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చింది.

ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 సాగుతోంది. నెమ్మదిగా చివరి దశకి చేరుకుంటోంది. ఆరంభంలో సీజన్ 8 ఏమాత్రం ఆసక్తి కలిగించలేదు. దీనితో వైల్డ్ కార్డు ఎంట్రీలని దించారు. అప్పటి నుంచి కాస్త ఎంటర్టైన్మెంట్ పెరిగింది. ఆల్రెడీ బిగ్ బాస్ షోలో పాల్గొన్న మాజీలనే వైల్డ్ కార్డుగా రంగంలోకి ఇచ్చారు. 

కన్నడ బిగ్ బాస్ లో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీలు అవసరం అయ్యాయి. తెలుగు బిగ్ బాస్ లో రాణించిన క్రేజీ బ్యూటీ శోభా శెట్టి తాజాగా కన్నడ బిగ్ బాస్ సీజన్ 11లో వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 శోభా శెట్టి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హౌస్ లో చాలా కాంట్రవర్సీలు క్రియేట్ చేసింది. శివాజీ, పల్లవి ప్రశాంత్ లాంటి వారితో తీవ్రమైన వివాదాలు పెట్టుకుంది. కార్తీక దీపం సీరియల్ లో నెగిటివ్ షేడ్స్ తో మెప్పించిన శోభా బిగ్ బాస్ లో కూడా నెగిటివిటి మూటగట్టుకుంది. 


ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ ఇంకెంత హంగామా చేస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కన్నడ బిగ్ బాస్ కి స్టార్ హీరో కిచ్చా సుదీప్ హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. శోభా శెట్టి ఎంట్రీ ఇవ్వగానే హౌస్ లో నీకు ఎవరు పోటీ ? ఎవరిని టార్గెట్ చేస్తావు అన్నట్లుగా సుదీప్ ప్రశ్నించాడు. తనకి ఎవరూ పోటీ కాదని శోభా సమాధానం ఇచ్చింది. బహుశా ఆమె కాంట్రవర్సీల గురించి తెలిసే సుదీప్ ఆ ప్రశ్న అడిగి ఉంటారు. 

శోభా శెట్టి హౌస్ లోకి వెళ్ళగానే కొబ్బరికాయలు కొట్టి హౌస్ లో ఉన్న సభ్యుల ఒక్కొక్కరిపై తన అభిప్రాయాలు చెప్పింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో ఒక రకంగా శోభితా శెట్టి తన ఉగ్ర రూపాన్ని ప్రదర్శించింది. ఎంతటి వివాదాలు అయినా వెనకడుగు వేయలేదు. గ్లామర్, తన ధైర్యం కారణంగా శోభా శెట్టి అభిమానులని కూడా సొంతం చేసుకుంది. 

Latest Videos

click me!