నటుడు, దర్శకుడు, గీత రచయిత, నిర్మాత.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి ధనుష్. ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక స్క్రీన్ నేమ్ కోసం ధనుష్ గా మారాడు. .
తొలుత విమర్శల పాలైన ధనుష్, జాతీయ అవార్డు అందుకునే స్థాయి నటుడిగా ఎదిగారు. అయితే, ఆరంభంలో నటుడిగా మారాలనే కోరిక కూడా లేదు.
ధనుష్ సినిమా జీవితానికి ఆయన సోదరుడు సెల్వరాఘవన్ దర్శకుడు కావడం ఎంతో ఉపయోగపడింది. ఒక్కో మెట్టూ ఎదుగుతూ కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్‌లలో పేరు తెచ్చుకున్నారు.
చిన్న వయసులో వెంకటేష్ ప్రభు అయిన ధనుష్‌కి ఒకే కల ఉండేది. అదే చదివి చెఫ్ కావాలని. కానీ, వచ్చిన సినిమా అవకాశాన్ని వదులుకోలేదు.
తనను ద్వేషించేవారి మధ్య ఏదో ఒకటి సాధించాలనే తపనతో పనిచేయడం మొదలుపెట్టిన ధనుష్‌కి రెండో సినిమాగా 'కాదల్ కొండేన్' వచ్చింది.
లోకల్ అబ్బాయి అయిన ధనుష్ 'రాంఝనా' సినిమా ద్వారా బాలీవుడ్‌కి వెళ్లారు. 'ఫకీర్' సినిమా ద్వారా హాలీవుడ్ నటుడయ్యారు.
ఏ వేదిక అయినా ఇష్టపడే నటుడు ధనుష్, అనవసర వివాదాల గురించి పెద్దగా పట్టించుకోరు. చెన్నైలోని పోయస్ గార్డెన్‌లో 150 కోట్ల రూపాయల విలువైన బంగ్లా ఉంది.
నయనతారా దగ్గర 3 సెకన్ల వీడియో కోసం 10 కోట్లు అడిగేంత ధనుష్ డబ్బు కష్టాల్లో ఉన్నారా అంటే లేదు. ఆయన ఆస్తి 230 కోట్ల రూపాయలు ఉందట. అయితే నయనతారతో ఎందుకు గొడవ మొదలైనట్లు.. నిజంగానే ధనుష్ 10 కోట్ల కోసం కక్కుర్తి పడ్డారా ? ఈ వివాదం గురించి అనేక రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి.