నేను చెప్పింది జరగకపోతే షర్ట్ విప్పి తిరుగుతా, అల్లు అర్జున్ ఛాలెంజ్..దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన యంగ్ హీరో ?

First Published | Nov 18, 2024, 12:12 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2పై అంచనాలు తారా స్థాయికి చేరాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత దేశం మొత్తం పుష్ప 2 హాట్ టాపిక్ గా మారిపోయింది. తెలుగు సినిమా నుంచి మరో 1000 కోట్ల చిత్రం అంటూ ఆల్రెడీ అంచనాలు మొదలయ్యాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2పై అంచనాలు తారా స్థాయికి చేరాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత దేశం మొత్తం పుష్ప 2 హాట్ టాపిక్ గా మారిపోయింది. తెలుగు సినిమా నుంచి మరో 1000 కోట్ల చిత్రం అంటూ ఆల్రెడీ అంచనాలు మొదలయ్యాయి. పాట్నా వేదికగా ట్రైలర్ లాంచ్ చేశారు. అల్లు అర్జున్ సూపర్ కాన్ఫిడెంట్ గా కనిపించారు. 

అయితే పుష్ప 2 ట్రైలర్ లో ప్రతి అంశం ఫ్యాన్స్ ని, ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. విలన్ చేతిలో దెబ్బ తిని నీళ్ళల్లో పడిపోవడం.. తిరిగి రౌడీలని ఊచకోత కోస్తూ లంగర్ సాయంతో పైకి లేవడం లాంటి డీటెయిల్స్ ఆకట్టుకుంటున్నాయి. పుష్ప 2 ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో పుష్ప చిత్రానికి సంబంధించిన విషయాలని కూడా నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. పుష్ప 1 రిలీజ్ సమయంలో అల్లు అర్జున్ మీడియా సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 


అల్లు అర్జున్ మాట్లాడుతూ.. కమర్షియల్ సినిమాని ఇలా కూడా తీయొచ్చా అనే విధంగా సుకుమార్ గారు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అంత అద్భుతంగా సుకుమార్ ఈ చిత్రాన్ని తీశారు. పొగడాలని చెప్పడం లేదు.. ఇది వాస్తవం. పుష్ప చిత్రం ఆడియన్స్ కి కనెక్ట్ అయితే మాత్రం ముందుగా మారుమోగేది సుకుమార్ గారి పేరే. పుష్ప రిలీజ్ తర్వాత చాలా మంది దర్శకులు సుకుమార్ దగ్గరకి వచ్చి క్లాసులు చెప్పించుకుంటారు. ఈ చిత్రాన్ని ఎలా తీశారు అని అడిగి తెలుసుకుంటారు. ఇది జరగకపోతే నేను మైత్రి ఆఫీస్ లో షర్ట్ విప్పి తిరుగుతా అంటూ అల్లు అర్జున్ ఛాలెంజ్ చేశాడు. 

బన్నీ చెప్పినట్లు డైరెక్టర్లు వచ్చి క్లాసులు చెప్పించుకోకపోయినా సుకుమార్ కి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. సుకుమార్ గారి వర్క్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి కాన్ఫిడెన్స్ తో చెబుతున్నట్లు అల్లు అర్జున్ తెలిపారు. ఇవి పుష్ప రిలీజ్ సమయంలో మూడేళ్ళ క్రితం అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు. అయితే తాజాగా ఇదే తరహా కామెంట్స్ ని ఓ యువ హీరో చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అల్లు అర్జున్ కి కౌంటర్ ఇచ్చాడా అనే అనుమానం కలిగేలా సదరు హీరో కామెంట్స్ ఉన్నాయి. 

ఆ హీరో ఎవరో కాదు డిఫెరెంట్ యాటిట్యూడ్ తో గుర్తింపు పొందిన విశ్వక్ సేన్. విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ చిత్రం నవంబర్ 22న రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రివ్యూయర్లు, క్రిటిక్స్ పట్ల మాకు చిన్న చూపు లేదు. సినిమా  గురించి మీరు ఏమైనా రాసుకోండి. అయితే అందులో వాస్తవాలు ఉండాలి. వాస్తవాలు లేకుంటే ప్రశ్నించే హక్కు మాకుంది. అదే విధంగా పర్సనల్ అటాక్ చేసినప్పుడు కూడా కోపం వస్తుంది అని విశ్వక్ సేన్ తెలిపారు. 

అక్కడ ఉన్న ఆడియన్స్ ని ఉద్దేశిస్తూ ఏంటి మీకు ఛాలెంజ్ కావాలా..మొన్ననే మెకానిక్ రాకీ సినిమా చూసుకున్నా. ఈ సినిమా సరిగ్గా ఆడకపోతే షర్ట్ లేకుండా తిరుగుతా.. జూబ్లీ హిల్స్ లో  నా ఇల్లు ఖాళీ చేస్తా.. ఇలాంటి ఛాలెంజ్ లు నేను చేయను. సినిమా హిట్టైన ఫ్లాప్ అయినా నా షర్ట్ నా ఒంటిమీదే ఉంటుంది.. నా ఇల్లు జూబ్లీ హిల్స్ లోనే ఉంటుంది అని తెలిపాడు. విశ్వక్ సేన్ కామెంట్స్ అల్లు అర్జున్ కి కౌంటర్ అంటూ నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ పుష్ప 2 ట్రైలర్ అద్భుతంగా ఉందని ప్రశంసించాడు కూడా. 

Latest Videos

click me!