తెలుగు తెర `సోగ్గాడు`, అందాల నటుడు శోభన్‌బాబు 13వ వర్థంతి నేడు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్,కృష్ణ, రామానాయుడు, జయలలిత, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, విజయశాంతిలతో దిగిన పలు అరుదైన ఫోటోలను అభిమానులు పంచుకున్నారు. వాటిని వైరల్ చేస్తున్నారు. ఈ అన్‌సీన్ పిక్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి.
`దేవత` చిత్రంలోని లుక్. ఇందులో వెల్లువచ్చి గోదారమ్మ` పాట ఎంతగా పాపులర్ అయ్యిందో తెలిసిందే.

721
ఓ కార్యక్రమంలో విజయశాంతితో.
ఓ కార్యక్రమంలో విజయశాంతితో.
821
`బొబ్బిలిసింహం` చిత్రం 200 రోజుల విజయోత్సవ సభలో.

921
తలైవి, తమిళనాడు మాజీ సీఎం జయలలితతో.
తలైవి, తమిళనాడు మాజీ సీఎం జయలలితతో.
1021
ఓ సినిమా షూటింగ్‌లో సుహాసినితో.
ఓ సినిమా షూటింగ్‌లో సుహాసినితో.
1121
ఓ కార్యక్రమంలో జయసుధ, రామానాయుడులతో,
ఓ కార్యక్రమంలో జయసుధ, రామానాయుడులతో,
1221
`శ్రావణసంధ్య` సినిమా షూటింగ్‌లో సుహాసిని, విజయశాంతిలతో.

1321
`ఖైదీ నెంబర్ 786` ముహూర్తం ఈవెంట్‌లో.
`ఖైదీ నెంబర్ 786` ముహూర్తం ఈవెంట్‌లో.
1421
తెలుగు చిత్ర పరిశ్రమలో `సోగ్గాడు`గా పేరుతెచ్చుకున్న శోభన్‌బాబు అందాల నటుడిగా పాపులర్ అయ్యారు. ఆయన అందానికి ఎంతో మంది హీరోయిన్లు ఫిదా అయినట్టుగా తెలుగు చిత్రపరిశ్రమ వర్గాలు చెప్పుకుంటాయి.

1521
శోభన్‌బాబు జనవరి 14, 1937న కృష్ణ జిల్లాలో జన్మించారు. కెరీర్ ప్రారంభంలో అనేక స్ట్ర్రగుల్స్ పడ్డారు శోభన్‌బాబు. చాలా సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేశారు. అతి తక్కువ రెమ్యూనరేషన్‌కి వర్క్ చేశారు. సినిమాల్లో నటించడం ద్వారా వచ్చిన డబ్బు తానుజీవించడానికి కూడా సరిపోయేవి కావు.

1621
దీంతో ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలనుకున్నారు కూడా. ఇంతలో వచ్చిన ఓ సినిమా ఆయన కెరీర్‌ని మలుపుతిప్పింది. `దైవబలం` చిత్రంతో నటుడిగా కెరీర్‌ని ప్రారంభించిన శోభన్‌బాబుకి `విరాభిమాన్యు` చిత్రం మంచి పేరుని, గుర్తింపు దక్కింది. నటుడిగా ఆయన మెయిన్ లీడ్ చేసిన చిత్రమిది.

1721
`విరాభిమన్యు` చిత్రంలో నటించేందుకు ఆయన టెన్షన్ పడ్డారు. సినిమాల నుంచి కూడా వెళ్లిపోవాలనుకున్నారు. చివరి ప్రయత్నంగా చేసిన కష్టం ఫలించింది. సినిమా బంపర్ హిట్ అయ్యింది. దీంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

1821
శోభన్‌బాబు మూడున్నద దశాబ్దాలకుపైగా నటించి మెప్పించాడు. 200లకు పైగా చిత్రాల్లో నటించాడు. ఆడియెన్స్ సోగ్గాడిగా నిలిచిపోయాడు.

1921
`సీతారామకళ్యాణం`, `మహమంత్రి తిమ్మరుసు`, `లవకుశ`, `నర్తనశాల`, `బంగారు పంజరం`, `దేశమంటే మనుషులోయ్`, `విరాభిహన్యు`, `మనుషులు మారాలి`, `కళ్యాణ మండపం`, `చెల్లెలి కాపురం`, `సంపూర్ణ రామాయణం`,`శారద`, `మంచి మనుషులు`, `జీవన జ్యోతి`, `సోగ్గాడు`, `కురుక్షేత్రం`,`గోరింటాకు`, `కార్తిక దీపం`, `మోసగాడు`, `దేవత`, `ముందడుగు` వంటి విజయవంతమైన సినిమాలు చేశారు.

2021
ఐదు నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వరించాయి. ఆయన మే 15 1958లో శాంత కుమారిని పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు సంతానం. తమ ఫ్యామిలీని, పిల్లలను సినిమాలకు దూరంగా ఉంచారు.

2121
2008, మార్చి 20న ఆయన గుండెపోటుకి గురై కన్నుమూశారు. తెలుగు ఆడియెన్స్ లో సోగ్గాడిగా చిరస్థాయిగా నిలిచిపోయారు.