రియల్‌ హీరో సోనూసూద్‌కి స్పైస్‌జెట్‌ అరుదైన గౌరవం.. ఏకంగా విమానంపైనే

Published : Mar 20, 2021, 03:55 PM IST

కరోనా రియల్‌ హీరో సోనూ సూద్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే ఆయనకు పలు సంస్థలు సేవా పురస్కారాలతో సత్కరించాయి. కానీ తాజాగా దక్కిన గౌరవం చాలా ప్రత్యేకమైనది కావడం విశేషం. ఇండియన్‌ ఎయిర్‌లైన్‌కి చెందిన స్పైస్‌జెట్‌ సోనూసూద్‌ని గొప్పగా కీర్తించింది.   

PREV
17
రియల్‌ హీరో సోనూసూద్‌కి స్పైస్‌జెట్‌ అరుదైన గౌరవం.. ఏకంగా విమానంపైనే
ఇండియాకి చెందిన ఎయిర్‌లైన్‌ విమానాల్లో స్పైస్‌జెట్‌ ఒకటి. ఈ విమాన సంస్థ సోనూ సూద్‌ సేవలను గుర్తించింది. కరోనా కష్టకాలంలో ఆయన పేదలకు, వలసకార్మికులకు చేసిన సేవ, అందించిన భరోసాని గుర్తించి గౌరవించింది.

27
తన స్సైస్‌జెట్‌ విమానంపై ఏకంగా సోనూ సూద్‌ ఫోటోని ప్రింట్‌ చేయించింది.   ఆయన చేసిన సేవలకు గౌరవంగా స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం మీద సోనూ సూద్ బొమ్మను వేశారు. `ఏ సెల్యూట్ టూ సేవియర్ సోనూ సూద్` అనే క్యాప్షన్ వేశారు.

37
ఇలా దేశీయ విమానయాన సంస్థ సొంత ఖర్చులతో ఒక వ్యక్తికి గౌరవార్థంగా ఇలా చేయడం ఇదే తొలిసారి.  లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్, స్పైస్ జెట్ సంస్థ సంయుక్తంగా పూనుకుని 2.5 లక్షల మంది భారతీయులను స్వస్థలాలకు చేర్చారు.  రష్యా, ఉజెబికిస్థాన్, మనిల, ఇంకొన్ని దేశాల్లో చిక్కుకుపోయిన 1500 మంది భారతీయ విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చారు.

47
స్పైస్ జెట్ సంస్థ తనకు ఇచ్చిన ఈ గౌరవం పట్ల సోనూ సూద్ చాలా సంతోషం వ్యక్తం చేశారు. తనతో కలిసి లాక్ డౌన్ సమయంలో స్పైస్ జెట్ చేసిన సేవలను గుర్తుచేసుకున్న సూనూ సూద్ ఇక మీదట కూడా ఇలాగే తన సేవా కార్యక్రమాలతో అందరినీ గర్వపడేలా చేయడానికి కృషి చేస్తానన్నారు.

57
నటుడు సోనూ సూద్ కరోనా కష్టకాలంలో చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.  కష్టాల్లో ఉన్నవారి కోసం ఆయన వేసిన ముందడుగు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది.  ఆయన్ను ఆదర్శంగా తీసుకుని అనేకమంది సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.  తమవంతు సహాయాన్ని అందించారు.

67
వలస కూలీలను, విదేశాల్లో చిక్కుకున్న పేద భారతీయులను, విద్యార్థులను ఇండియాలోని వారి వారి స్వస్థలాలకు చేర్చడంలో సోనూ సూద్ కృషి మరువలేనిది.  ఆయన చూపిన చొరవ మూలంగా ఎందరో తమవారిని చేరుకున్నారు. లాక్ డౌన్ మూలంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న అనేక మంది సోనూ సూద్ సాయంతో ఊరట పొందారు.  సోనూ సేవలకు దేశం మొత్తం ఆయన్ను కొనియాడింది.  సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు కొనియాడారు.

77
మరోవైపు సోనూ సూద్‌ సేవలను పలు అంతర్జాతీయ సంస్థలు కూడా గుర్తించి గౌరవించాయి. మరోవైపు `ఐ యామ్‌ నో మెస్సయ్య` అనే పుస్తకం కూడా సోనూసూద్‌ చేసిన సేవా కార్యక్రమాలపై ముద్రించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సోనూసూద్‌ నటుడిగా తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటిస్తున్నారు. తెలుగులో ఆయన `ఆచార్య`లో నటిస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories