ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా హాజరైన శివరాజ్ కుమార్ మాట్లాడుతూ, కమల్ హాసన్‌తో తన తొలి సన్నిహిత అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. "ఒకసారి కమల్ సర్ మా ఇంటికి వచ్చారు. నాన్నగారు డాక్టర్ రాజ్‌కుమార్‌గారితో మాట్లాడుతుండగా నేను పక్కన నిలబడి వారిని గమనిస్తూ ఉన్నాను.
ఆ సమయంలో ఆయన నా వైపు తిరిగి చేతులు కలిపారు. నేను ఆయన్ని కౌగిలించుకోవచ్చా అని అడిగితే, ఆయన నవ్వుతూ ఒప్పుకున్నారు. ఆ కౌగిలింత తర్వాత మూడు రోజుల పాటు నేను స్నానం చేయలేదు. ఆయన వాసన నాపై అలాగే ఉండాలని కోరుకున్నాను. ఆయనంటే నాకు అలాంటి అభిమానం," అని చెప్పారు. ఈ మాటలతో ప్రేక్షకులు సైతం ఎమోషనల్ గా ఫీల్ అయ్యి చప్పట్లు కొట్టారు.