నాగచైతన్య మొదటి ముద్దు ఎవరికి ఇచ్చాడో తెలుసా? సమంతకి అస్సలు కాదు, తెలిస్తే షాకే

Published : May 28, 2025, 05:00 PM IST

నాగచైతన్య రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదట హీరోయిన్‌ సమంతని, ఆ తర్వాత మరో హీరోయిన్‌ శోభితాని వివాహం చేసుకున్నారు. కానీ తన మొదటి ముద్దు ఎవరికి ఇచ్చాడో తెలిపారు చైతూ.

PREV
15
మిస్టరీగా సమంత, నాగచైతన్య విడాకులు

నాగచైతన్య, సమంత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. మ్యారేజ్‌ అయిన నాలుగేళ్లకే విడిపోయారు. వీరిద్దరు విడిపోవడానికి కారణాలు ఏంటనేది వెల్లడించలేదు. రకరకాల రూమర్లు వినిపించాయి, కానీ ఏది నిజం అనేది తెలియదు.

25
శోభితాతో ఫ్యామిలీ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్న చైతూ

నాగచైతన్య ఇటీవలే మరో హీరోయిన్‌ శోభితా దూళిపాళని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరు కూడా కొన్నాళ్లపాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. రెండు కుటుంబాల అంగీకారంతోనే ఈ పెళ్లి జరిగింది. ఇప్పుడు వీరిద్దరు తమ వైవాహిక జీవితాన్నిఎంజాయ్‌ చేస్తున్నారు.

35
నాగచైతన్య మొదటి ముద్దు సమంతకి కాదా?

ఇదిలా ఉంటే నాగచైతన్య ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన మొదటి ముద్దు గురించి ఓపెన్‌ అయ్యారు. సాధారణంగా తన మొదటి ముద్దు తన ఫస్ట్ లవర్‌ సమంతకే ఇచ్చి ఉంటారని అంతా భావిస్తారు. కానీ ఆయన సమంతకి ఇవ్వలేదట. అంతకు ముందే వేరే అమ్మాయికి ఇచ్చేశాడట. అంతేకాదు ఆ ముద్దు తన లైఫ్‌ లాంగ్‌ గుర్తుండిపోతుందని తెలిపారు చైతూ.

45
నాగచైతన్య ఫస్ట్ ముద్దు సీక్రెట్‌

రానా నిర్వహించిన టాక్‌ షోలో పాల్గొన్న నాగచైతన్య తన ఫస్ట్ కిస్‌ గురించి ఓపెన్‌ అయ్యారు. మొదటి ముద్దు ఎవరికి పెట్టావో గుర్తుందా అని రానా అడగ్గా, చైతూ స్పందిస్తూ తొమ్మిదో తరగతిలోనే ఓ అమ్మాయికి పెట్టినట్టు తెలిపారు. అంతేకాదు ఆ కిస్‌ తన జీవితమంతా గుర్తుండిపోతుందన్నారు.

55
సమంత కంటే నాగచైతన్యనే తెల్లగా

ఇదే సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు చైతూ. ఒక అభిమాని తన వద్దకు వచ్చి సమంత కంటే మీరే తెల్లగా(అందంగా) ఉన్నారని చెప్పడం కూడా మర్చిపోలేని జ్ఞాపకం అని వెల్లడించారు చైతూ. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories