Shiva Shankar Master: కొరియోగ్రాఫర్‌ నుంచి కమెడీయన్‌ వరకు.. ఛాన్స్ ల కోసం చివరికి అలా..

First Published Nov 28, 2021, 10:49 PM IST

శివశంకర్‌ మాస్టర్‌ ఒకప్పుడు తిరుగులేని డ్యాన్స్ మాస్టర్‌. అయితే ఆయన కమర్షియల్‌ డాన్సుకి దూరం కావడం వల్ల, ఆయన కేవలం ట్రెడిషనల్‌ సాంగ్‌లకే పరిమితమవ్వడం వల్ల కెరీర్‌ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారనే కామెంట్స్ వినిపించాయి. 

కొరియోగ్రాఫర్ శివ శంకర్ Shiva Shankar Master మాస్టర్ గురించి తెలియని వారు, వినని వారెవ్వరూ ఉండరు. శివ శంకర్ మాస్టర్ అంటే అందరికీ ఓ ప్రత్యేక వస్త్రాధారణ, ఆకట్టుబొట్టూ అందరికీ కనిపిస్తాయి. ముఖ్యంగ ఆ మాట తీరుమరింత ఫేమస్. ఇక రియాల్టీ షోల్లో శివ శంకర్ మాస్టర్ న్యాయ నిర్ణేతగా అప్పట్లో ఓ ట్రెండ్ క్రియేట్ చేశారు. శివశంకర్‌ మాస్టర్‌ కొరియోగ్రాఫర్‌గా అనేక పాటల ద్వారా అలరించారు. అద్భుతమైన డాన్సుల ద్వారా అలరించారు. అబ్బురపరిచే డాన్సులతో మెప్పించారు. కానీ శివశంకర్‌ మాస్టర్‌లో మంచి నటుడు కూడా ఉన్నాడు. ఆయన చాలా సినిమాల్లో నటుడిగా మెప్పించారు. ముప్పైకి పైగా చిత్రాల్లో నటుడిగా ఆకట్టుకున్నారు. 

తెలుగు, తమిళం, మలయాళం వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగులో ఆయన `సుడిగాడు`, `శివలింగ`, `నేనే రాజు నేనే మంత్రి`, `సర్కార్‌`, `ఎన్టీఆర్‌ఃకథానాయకుడు`, `అక్షర`, `నిను వీడని నీడను నేనే`, `రాజుగారి గది 3` వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. నటుడిగా చాలా వరకు కామెడీ, సెంటిమెంట్‌ తరహా పాత్రల్లో మెప్పించారు. తమిళంలోనూ స్టార్‌ హీరోల చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. 

మరోవైపు టెలివిజన్‌లోనూ మెప్పించారు. ఆయన తెలుగులో జీ తెలుగులో `నాగ భైరవి` సీరియల్లో నటించారు. `నెంబర్‌ వన్‌ కోడలు` సీరియల్‌లోనూ నటించారు. వీటితోపాటు టీవీ షోస్‌లోనూ అలరించారు. ఒకప్పుడు డాన్సు మాస్టర్‌గా ఫుల్‌ బిజీగా ఉన్న ఆయన గత కొన్ని రోజులుగా ఆయనకు సినిమాలు లేవు. సాంప్రదాయ నృత్యాలకు మాత్రమే పరిమితం కావడంతో అవకాశాలు తగ్గాయి. ఇది ఆయన కెరీర్‌ని ఒడిదుడుకులకు గురి చేసింది. దీంతో ఆయన బుల్లితెరని సైతం ఉపయోగించుకోవాలనుకున్నారు. కమెడీయన్‌గా మారారు. 

శివశంకర్ మాస్టర్ ఆ మధ్య బుల్లితెరపై మళ్లీ సందడం చేయడం ప్రారంభించాడు. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా దుమ్ములేపుతున్నాడు. మొదటగా శివ శంకర్ మాస్టర్ `జబర్దస్త్` షోపై కామెడీ చేశాడు. ఆ మధ్య గెస్ట్ ఎంట్రీ ఇచ్చి కామెడీ చేశారు. హైపర్ ఆది స్కిట్స్‌లో రచ్చ చేసి మాయమయ్యాడు. మళ్లీ `బొమ్మ అదిరింది` షోలో మెరిశాడు. అక్కడ శివ శంకర్ మాస్టర్‌ను ఓ రేంజ్‌లో ఇమిటేట్ చేసి పడేశారు. ఆ స్కిట్ కూడా ఓరేంజ్‌లో పండింది. 

అయితే మళ్లీ శివ శంకర్ మాస్టర్ `ఎక్స్ ట్రా జబర్దస్త్ `షోలోకి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు. బుల్లెట్ భాస్కర్ టీంలో నువ్వా నేనా అనే డ్యాన్స్ ప్రోగ్రాం స్కిట్ వేశారు. అందులో శివ శంకర్ మాస్టర్ న్యాయ నిర్ణేతగా ఎంట్రీ ఇచ్చాడు. మొత్తానికి అదిరింది, జబర్దస్త్ టీంలు శివ శంకర్ మాస్టర్‌ను, శివ శంకర్ మాస్టర్ ఆ రెండు కామెడీ షోలను బాగా వాడేసుకుంటున్నారు. అలా గెస్ట్‌గా వచ్చి అయినా శివ శంకర్ మాస్టర్ వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే కెరీర్‌ పరంగా తాను పుంజుకునేందుకు చేసిన ఆయన ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఆయన కెరీర్‌ గాడిలో పడలేదు. కష్టాలు తప్పలేదు. 
 

శివశంకర్‌ మాస్టర్‌ (72)  కరోనాకి గురై హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఇటీవల శివశంకర్ మాస్టర్ కుటుంబం వైరస్‌ మహమ్మారి బారిన పడింది. ప్రస్తుతం శివశంకర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ కరోనాతో పోరాడుతున్నారు. వారి కుటుంబ చికిత్స కోసం మాస్టర్ చిన్న కుమారుడు అజయ్‌ విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. అయినా తండ్రిని బతికించుకోలేకపోయారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు. 

also read: Sivasankar Master Death: శివశంకర్ మాస్టర్ కన్నుమూత.. కరోనా బారినపడి, మృత్యువుతో పోరాడి ఓడిన ప్రతిభాశాలి

also read: Shiva Shankar: విధిని ఎదిరించిన శివశంకర్ మాస్టర్.. వెన్నెముక విరిగినా జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా..

click me!