Shiva Shankar: విధిని ఎదిరించిన శివశంకర్ మాస్టర్.. వెన్నెముక విరిగినా జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా..

First Published Nov 28, 2021, 9:56 PM IST

టాలీవుడ్ లో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడిన శివశంకర్ మాస్టర్ చివరకు మృత్యు ఒడికి చేరారు. ఇటీవల శివ శంకర్ మాస్టర్ కు కరోనా సోకడంతో చికిత్స కోసం గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు.

టాలీవుడ్ లో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడిన శివశంకర్ మాస్టర్ చివరకు మృత్యు ఒడికి చేరారు. ఇటీవల శివ శంకర్ మాస్టర్ కు కరోనా సోకడంతో చికిత్స కోసం గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. కొన్ని రోజులుగా శివశంకర్ మాస్టర్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. వైద్యులు శ్రమించినప్పటికీ శివశంకర్ మాస్టర్ ప్రాణాలు నిలబెట్టలేకపోయారు. 

దక్షణాది భాషల్లో వందలాది చిత్రాలకు తన అద్భుతమైన డాన్స్ కొరియోగ్రఫీ అందించారు  Shiva Shankar Master . బుల్లితెరపై డాన్స్ షోలలో జడ్జిగా కూడా పనిచేశారు. రొమాంటిక్, విభిన్నమైన పాటలకు శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తూ సౌత్ లో పాపులర్ అయ్యారు. ఆయన అనూహ్య మరణం చిత్ర పరిశ్రమని విషాదంలోకి నెట్టింది. 

శివ శంకర్ మాస్టర్ విధిని ఎదిరించిన పోరాటయోధుడు అని చెప్పాలి. ఎవరికైనా వెన్నెముక విరిగితే కనీసం లేచి నిలబడడం కష్టం. అలాంటి శివశంకర్ మాస్టర్ ఏకంగా డాన్స్ కొరియోగ్రాఫర్ అయ్యారు. జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా Magadheera చిత్రంలోని 'ధీర ధీర' సాంగ్ కు అవార్డు కూడా అందుకున్నారు. శివశంకర్ మాస్టర్ 1948 డిసెంబర్ 7న చెన్నైలో జన్మించారు. కల్యాణ సుందర్‌, కోమల అమ్మాళ్‌ తల్లిదండ్రులు. తండ్రి కొత్వాల్‌ చావిడిలో హోల్‌సేల్‌ పండ్ల వ్యాపారం చేసేవారు.

శివశంకర్ మాస్టర్ ఏడాదిన్నర వయసులో పసి బాబుగా ఉన్న సమయంలోనే తీవ్ర ప్రమాదానికి గురయ్యారు. శివశంకర్ మాస్టర్ ని ఆడిస్తూ వాళ్ళ పెద్దమ్మ అరుగుమీద కూర్చుందట. ఒక ఆవు తాడు తెంపుకుని పరిగెత్తుతూ వచ్చింది. తమని కుమ్మడానికి ఆవు వస్తుందేమోనని ఆమె భయపడింది. శివశంకర్ మాస్టర్ ని ఎత్తుకుని కంగారుగా పరిగెట్టడంతో పమాదవశాత్తు పడిపోయింది. దీనితో ఆమె చేతిలో ఉన్న శివశంకర్ మాస్టర్ కూడా కింద పడ్డారు. శివశంకర్ మాస్టర్ పసి బాలుడు కావడంతో బలమైన గాయం అయింది. వెన్నెముక విరిగిపోయింది. 

ఎంతో మంది వైద్యులని కలిశారు. ప్రయోజనం లేదు. చివరకు అమెరికాలో పనిచేసే నరసింహ అయ్యర్ అనే డాక్టర్ ని సంప్రదించగా.. పిల్లాడిని తనవద్దే వదిలి వెళ్లాలని.. నడిచేలా చేసి మీకు అప్పగిస్తానని డాక్టర్ చెప్పారు. దీనితో కుటుంబ సభ్యులు డాక్టర్ పైనే భారం వేశారు. అలా శివశంకర్ మాస్టర్ 8 ఏళ్ల వయసు వరకు మంచం లోనే పడుకుని ఉన్నారు. శివశంకర్ మాస్టర్ కు 16 ఏళ్ల వయసులో వెన్ను నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. 

అప్పటికే మాస్టర్ కు డాన్స్ పై మక్కువ పెరిగింది. డాన్స్ ప్రోగ్రాం లకు హాజరై చూసి ఆనందించేవారు. అలా తనంతట తానే డాన్స్ లో మెళుకువలు నేర్చుకున్నారు. నెమ్మదిగా డాన్స్ ట్రూప్స్ లో చేరి డాన్స్ షోలు ఇవ్వడం ప్రారంభించారు. చదువుపై ఆసక్తి ఉండేది కాదు. పదో తరగతి పూర్తయ్యాక తన తండ్రికి ధైర్యం చేసి డాన్సర్ అవుతా అని చెప్పేశాడు. దీనితో శివశంకర్ మాస్టర్ తండ్రి ఓ జ్యోతిష్యుడి వద్ద జాతకం చూపించారు. ఆ జ్యోతిష్యుడు మాస్టర్ జాతకం చూడగానే తిరుగులేని డాన్సర్ అవుతారని తేల్చి చెప్పేశారట. 

ఇక డాన్స్ లో పూర్తిగా రాటుదేలాక 1975లో శివశంకర్ మాస్టర్ సినీ రంగ ప్రవేశం జరిగింది. శివాజీ గణేశన్, జయలలిత నటించిన 'పాట్టుమ్ భారతముమ్' చిత్రానికి శివశంకర్ మాస్టర్ డాన్స్ అసిస్టెంట్ గా పనిచేశారు. శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన తొలి చిత్రం 'కొరివికూడు'. Also Read: Sivasankar Master Death: శివశంకర్ మాస్టర్ కన్నుమూత.. కరోనా బారినపడి, మృత్యువుతో పోరాడి ఓడిన ప్రతిభాశాలి

click me!