Vedha movie Review : కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ‘వేద’ మూవీ రివ్యూ!

First Published | Feb 9, 2023, 7:15 PM IST

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) నటించిన ‘వేద’ చిత్రం ఈరోజు  తెలుగులో విడుదలైంది. ఆయనకు ఎంతో ప్రత్యేకమైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందా? లేదా? అన్నది రివ్యూలో చూద్దాం.

కన్నడలో శివరాజ్ కుమార్ సూపర్ స్టార్ అనే విషయం తెలిసిందే. ప్రేక్షకులు కోరుకునే చిత్రాల్లోనే ఎక్కువగా నటిస్తుంటారు. 1986 నుంచి ఇప్పటివరకు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటి వరకు 124 చిత్రాల్లో నటించి మెప్పించగా.. తాజాగా 125 చిత్రంగా ‘వేద’ విడుదలైంది. ఇప్పటికే కన్నడలో రిలీజ్ అయి హిట్ చిత్రంగా నిలిచింది. శివరాజ్ కుమార్ కు ప్రత్యేకమైన ఈ చిత్రం ఈరోజు (ఫిబ్రవరి 9) తెలుగు వెర్షన్ లో విడుదలైంది. ఆయన 125వ చిత్రంగా తెరకెక్కడం, తన భార్య నిర్మాతగా ‘గీత పిక్చర్స్’ బ్యానర్ పై నిర్మించడం విశేషం. కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ బ్యానర్  నిర్మాత వి.ఆర్.కృష్ణ మండపాటి తెలుగులో రిలీజ్ చేశారు. ఇంతకీ సినిమా తెలుగులో ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం..

కథ : షిర్లీ అనే గ్రామ నేపథ్యంలో సాగే ఈ చిత్రం 1965-1985 మధ్య కాలంలో జరిగే పరిస్థితుల చుట్టూ తిరుగుతుంటుంది.  వేద(శివరాజ్‌కుమార్) తన స్నేహితులతో గ్రామంలోనే సంతోషంగా జీవిస్తుంటారు. ఊర్లో అందరితో కలివిడిగా ఉంటారు. ఆనందంగా జీవితాన్ని గడుతుపుతున్న ఆయన జీవితంలో ఓ విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ కారణంగా పుష్ప (గానవి లక్ష్మణ్)ని పెళ్లి చేసుకుంటాడు వేద. దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంటకు కనక (అదితి సాగర్) అనే ఆడబిడ్డ జన్మిస్తుంది. అప్పటి వరకు వీరి జీవితం సాఫీగా సాగిపోతుంటుంది. కూతురు పుట్టాక కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. సంతోషంగా ఉండే తమ కుటుంబానికి బీరా (చెలువరాజ్) నేతృత్వంలోని క్రూరమైన స్నేహితుల ముఠా ద్వారా సమస్యలు ఏర్పడుతాయి.  ఈ క్రమంలో వేద భార్యకు ప్రమాదం వాటిల్లుతుంది. దీంతో వేద, అతని కుమార్తె శత్రువులను అంతమొందిస్తుంటారు. ఇంతకీ ఫుష్ఫకు ఏమైంది? ఆ ముఠాకు గ్రామంలో ఉండే వేదకి సంబంధం ఏంటీ? తండ్రీ - కూతురు ఆ సమస్యల్ని ఎదుర్కొన్నారు? అనే ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ.  

Latest Videos


విశ్లేషణ : ‘వేద’ చిత్రం ఒక పీరియాడికల్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కింది. దర్శకుడు హర్ష కథ రాయడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. కథ గొప్పగా ఏమీ లేదు. కానీ సినిమాను తెరకెక్కించిన విధానం ఆకర్షణీయంగా ఉంటుంది. సినిమా గురించి చెప్పాలంటే ఓ కుటుంబానికి జరిగిన అన్యాయంపై తండ్రీ కూతురు ఎలా తిరుగుబాటు చేశారన్నదే ఈ చిత్రంగా చెప్పొచ్చు. యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. స్లోమోషన్ షాట్స్, విజువల్స్ అద్భుతంగా కనిపిస్తాయి. కొన్ని హై మూమెంట్స్‌తో రెగ్యులర్ ఇంటర్వెల్‌ ఉంటుంది. కథను వివరించే సన్నివేశాల క్రమం బాగుంది. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సరైన సెటప్ ఉందనిపించింది. స్క్రీన్‌ప్లే కొన్ని భాగాల్లో డల్‌గా కనిపిస్తాయి. కానీ వాటిని కవర్ చేసేందుకు కొన్ని హైప్ ఇచ్చే సీన్లను క్రియేట్ చేయడం ద్వారా దర్శకుడు ఆ లొసుగులను సమతుల్యం చేశారు. కథ రోటీన్ గానే ఉన్నా.. దర్శకుడు హర్ష డీల్ చేసిన విధానం భిన్నంగా ఉంది. మొదటి భాగం, రెండో భాగంలోని ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ లు మాత్రం అదిరిపోతాయి. మాస్ ఆడియెన్స్ కు సినిమా బాగా నచ్చుతుంది. 

నటీనటుల పెర్ఫామెన్స్ :  కన్నడ స్టార శివరాజ్ కుమార్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక విషాదకరమైన గతం ఉన్న వ్యక్తి పాత్రలో శివరాజ్‌కుమార్ అద్భుతంగా నటించారు. తండ్రిగా, భర్తగా ఎమోషన్స్ ను పండించటం ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరోవైపు యాక్షన్ సీన్లలోనూ ఇరగదీశారు. సినిమాలో శివరాజ్ కుమార్ లుక్ ఆకట్టుకుంటుంది. గానవి లక్ష్మణ్ పాత్ర చిత్రానికి సప్రైజ్ ప్యాకేజీ. ఫస్టాఫ్ లో విలేజ్ లుక్ లో కనిపించినా.. సెకండాఫ్‌లోని కీలక సన్నివేశాలలో మాత్రం ఆమె నటన అద్భుతనిపిస్తుంది. శివరాజ్‌కుమార్, గానవి మధ్య రొమాంటిక ఫన్నీ సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించారు. కూతురు పాత్రలో అదితి సాగర్ మెప్పించారు. ఒకరకంగా ఆమె పాత్ర సినిమాకు హైలెట్ అనిచెప్పొచ్చు. ఇక వీణా పొన్నప్ప పోలీసు పాత్రలో ఆకట్టుకున్నారు. మిగితా పాత్రధారులు తమ పరిధిలో అలరించారు. 
 

టెక్నీషియన్ల పనితీరు : ఈ యాక్షన్ డ్రామాకు అర్జున్ జన్య అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అతను అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలక సన్నివేశాలను అద్భుతంగా ఎలివేట్ చేశాయి. సెకండాఫ్‌లో రెండు యాక్షన్ స్టంట్స్ కు ఇచ్చిన సౌండింగ్ అద్భుతమనిపిస్తుంది. స్వామి జె. గౌడ ఫోటోగ్రఫీ వర్క్ సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్తుంది. దీపు ఎస్. కుమార్ ఎడిటింగ్ వర్క్ బాగానే ఉంది. యాక్షన్ కొరియోగ్రాఫర్‌లను  మెచ్చుకోవాలి. అంత అదర్భుతంగా యాక్షన్ సీన్స్ ను రూపొందించారు. ప్రొడక్షన్ డిజైన్ వర్క్ ఆకర్షణీయంగా ఉంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. 

రేటింగ్:2.75

నటీనటులు : శివరాజ్ కుమార్, గానవి లక్ష్మణ్, అదితి సాగర్, చెలువ రాజ్, ఉమాశ్రీ, శ్వేత చంగప్ప, వీణ పొన్నప్ప, రఘు శివమొగ్గ తదితరులు
దర్శకుడు : ఏ హర్ష
ప్రొడ్యూసర్స్ : గీతా శివరాజ్ కుమార్, జీ స్టూడియోస్
బ్యానర్ : జీ స్టూడియోస్, గీతా పిక్చర్స్
సినిమాటోగ్రఫీ : స్వామీ జే గౌడ
ఎడిటర్ : దీపు ఎస్ కుమార్
మ్యూజిక్ డైరెక్టర్ : అర్జున్ జన్య
విడుదల తేదీ : 09 ఫిబ్రవరి 2023

click me!