పింక్ డ్రెస్ లో ‘బిగ్ బాస్’ బ్యూటీ గ్లామర్ మెరుపులు.. క్యూట్ స్టిల్స్ తో ఆకట్టుకుంటున్న సిరి హన్మంత్

First Published | Feb 9, 2023, 5:37 PM IST

‘బిగ్ బాస్’ ఫేమ్, యంగ్ బ్యూటీ సిరి హన్మంత్ (siri Hanmanth) సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. 
 

‘బిగ్ బాస్’తో మంచి ఫేమ్ దక్కించుకుంది యంగ్ బ్యూటీ సిరి హన్మంత్. అంతకు ముందు యూట్యూబ్ లో సందడి చేసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ కట్టిపడేస్తోంది.
 

తాజాగా పింక్ డ్రెస్ లో సిరి బ్యూటీఫుల్ గా ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను ఇన్ స్టాలో పంచుకుంది. ప్రస్తుతం పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ లో సిరి హన్మంత్ బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకున్నారు. 
 


బిగుతైన గులాబీ రంగు గౌన్ లో హోయలు పోతూ.. ఫొటోలకు స్టన్నింగ్ గా ఫోజులిచ్చింది. యంగ్ బ్యూటీ గ్లామర్ మెరుపులకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. క్యూట్ స్మైల్ తో, స్టన్నింగ్ స్టిల్స్ తో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తుండటంతో నెటిజన్లు ఈ బ్యూటీని మరింతగా సపోర్ట్ చేస్తున్నారు. తను పంచుకునే పోస్టులను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ఈ బ్యూటీ తాజా లుక్ కు ఫిదా అవుతున్నారు. యంగ్ బ్యూటీ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

కింగ్, అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’ సీజన్ 5లో సిరి హన్మంతు ఎంట్రీ ఇచ్చారు. హౌజ్ లో తనదైన శైలిని చూపిస్తూ టీవీ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. టాప్ ఫైవ్ లో నిలిచి తన మార్క్ చూపించారు. ఆ సీజన్ లో వీజే సన్నీ టైటిల్ గెలుచుకున్నారు. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చాక సిరి హన్మంతు బుల్లితెరపై మెరుస్తున్నారు. యాంకర్ గా, నటిగా అవకాశాలను అందుకుంటూ కేరీర్ ను గాడీలో పెడుతున్నారు. ఆయా షోల్లో మెరుస్తూ టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరవుతున్నారు. 

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు సిరికి 858కే మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. ఆ సంఖ్యను పెంచేందుకు వరుస పోస్టులతో ఆకట్టుకుంటున్నారు. 

మరోవైపు బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతోనూ అదరగొడుతున్నారు. ట్రెడిషనల్, ట్రెండీ వేర్స్ లోనూ స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ అలరిస్తున్నారు. గ్లామర్ విందుతోనూ యువతను మంత్రముగ్ధులను చేస్తోంది. ఇంటర్నెట్ ఫ్యాన్స్ ను సంపాదించుకుంటోంది. 

Latest Videos

click me!