పాఠాలు చెప్పే పోలీస్ ఛేదించిన మిస్టరీ, ఓటీటీలో క్రేజీ రెస్పాన్స్..దసరా విలన్ హీరోగా, ఐఎండీబీ రేటింగ్ ఇదే

Published : Aug 30, 2025, 03:59 PM IST

షైన్ టామ్ ప్రధాన పాత్రలో నటించిన సూత్రవాక్యం చిత్రం అద్భుత విజయం సాధించింది. ఈ మూవీలో షైన్ టామ్ పోలీస్ అధికారిగా నటించారు.

PREV
15

దసరా చిత్రంలో విలన్ గా నటించిన షైన్ టామ్ చాకోని తెలుగు ప్రేక్షకులు మరచిపోలేరు. ఆ మూవీలో షైన్ టామ్ మహిళలపై వ్యామోహం ఉండే సైకోలా నటించి సర్ప్రైజ్ చేశారు. ఇప్పుడు కూడా షైన్ టామ్ కి తెలుగులో అనేక అవకాశాలు వస్తున్నాయి. మలయాళీ నటుడైన షైన్ టామ్ తన సొంత భాషల్లో హీరోగా కూడా నటిస్తున్నారు.

25

ఇటీవల షైన్ టామ్ ప్రధాన పాత్రలో నటించిన సూత్రవాక్యం చిత్రం అద్భుత విజయం సాధించింది. ఈ మూవీలో షైన్ టామ్ పోలీస్ అధికారిగా నటించారు. ఈ మూవీలో విన్సీ అలోషియస్, దివ్య నైర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్ర షూటింగ్ సమయంలో షైన్ టామ్ తనని వేధించారని విన్సీ లోషియస్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అది పెద్ద వివాదానికి దారితీసింది. దీనితో షైన్ టామ్ ఆమెకి బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పారు.

35

ఇక సినిమా విషయానికి వస్తే యజియన్ జోస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. థియేటర్లలో మంచి విజయం సాధించిన తర్వాత ఓటీటీలో విడుదలైంది. ఈ చిత్ర తెలుగు వర్షన్ ఈటీవి విన్ ఓటీటీలో స్టీమింగ్ అవుతోంది. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన సూత్రవాక్యం చిత్రానికి ఓటీటీలో అదిరిపోయే రియాక్షన్ దక్కుతోంది. ఐఎండీబీ సంస్థ ఈ చిత్రానికి 7.6 రేటింగ్ ఇవ్వడం విశేషం.

45

కథ విషయానికి వస్తే.. క్రిస్టో జేవియర్(షైన్ టామ్ చాకో) పోలీస్ అధికారిగా పనిచేస్తుంటారు. పోలీస్ గా విధులు నిర్వహిస్తూనే ఖాళీ సమయంలో పిల్లలకు ట్యూషన్ చెబుతుంటారు. కొందరు పిల్లలు అయితే స్కూల్ కి వెళ్లకుండా క్రిస్టో చెప్పే పాఠాల కోసమే వస్తుంటారు. దీనితో స్కూల్ టీచర్ నిమిషా అతడిపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తుంది. ఇంతలో అతడి ట్యూషన్ లో ఒక సంఘటన జరుగుతుంది. అతడి ట్యూషన్ కి వచ్చే ఆర్య అనే అమ్మాయి.. అఖిల్ అనే అబ్బాయితో చనువుగా ఉంటుంది. ఇది చూసిన ఆర్య సోదరుడు వివేక్ వాళ్ళిద్దరిపై దాడి చేసి పారిపోతాడు.

55

ఆ సంఘటన తర్వాత వివేక్ అసలు ఊర్లోనే కనిపించడు. అతడి ఆచూకీ తెలుసుకోవాలని క్రిస్టో ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఈ ఇన్వెస్టిగేషన్ లో క్రిస్టోకి ఒక మర్డర్ గురించి తెలుస్తుంది. అసలు వివేక్ ఏమయ్యాడు ? మరణించిన అమ్మాయికి అతడికి ఏమైనా సంబంధం ఉందా ? చివరికి ఈ మిస్టరీని క్రిస్టో ఎలా ఛేదించాడు అనేది మిగిలిన కథ. ఈ చిత్రం సస్పెన్స్ ఎలిమెంట్స్, ట్విస్టులతో ఆకట్టుకుంటూనే మంచి వినోదాన్ని కూడా అందిస్తుంది. ఓటీటీలో ఈ చిత్రం మంచి టైం పాస్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories