రజినీకాంత్ కు సమానంగా రెమ్యునరేషన్, అయినా నో చెప్పిన సత్యరాజ్, కారణం ఏంటి?

Published : Aug 30, 2025, 02:30 PM IST

శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన శివాజి చిత్రంలో సూపర్ స్టార్ కి విలన్ గా నటించడానికి కట్టప్ప సత్యరాజ్ నో చెప్పాడట. దానికి కారణాలుఏంటి అనేది తాజాగా వెల్లడించారు స్టార్ నటుడు. ఇంతకీ ఆయన ఏమంటున్నాడంటే

PREV
14

దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో  ప్రేక్షకుల అభిమాన నటులలో ఒకరైన సత్యరాజ్, హీరోగా, విలన్ గా అద్భుతమైన  పాత్రలలో మహాద్భుతంగా నటించారు. ఇటీవల లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన కూలీ సినిమాలో  ఖైదీ నెం. 9696 అనే పాత్రలో నటించారు. రజినీకాంత్ స్నేహితుడిగా ఆ చిత్రంలో సత్యరాజ్ కనిపించారు. 

24

 కూలీ చిత్రం ద్వారా రజినీ, సత్యరాజ్ 37 సంవత్సరాల తర్వాత కలిసి తెరపై కనిపించారు.  ఈ మధ్య కాలంలో వారు ఏ సినిమాలోను నటించలేదు. అయితే  రజినీకాంత్ నటించిన శివాజి చిత్రంలో విలన్ గా  సత్యరాజ్ ను తీసుకోవాలని డైరెక్టర్ శంకర్ చాలా ప్రయత్నించారు. కానీ ఆ అవకాశాన్ని సత్యారాజ్ వద్దనుకున్నారు, ఆ పాత్రను తిరస్కరించారు.

34

రజినీకాంత్ కు సమానమైన రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్ చేసినా కూడా సత్యరాజ్ ఈ పాత్రకు ఒప్పుకోలేదు. దానికి కారణం ఏంటీ అనేది రీసెంట్ గా ఆయన వెల్లడించారు.  ఆ సమయంలో, నా హీరో ఇమేజ్ ని తిరిగి నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నా సినిమాలు నిరంతరం విఫలమైనందున, మార్కెట్ ని తిరిగి పట్టుకోవాల్సి వచ్చింది. శంకర్ నన్ను పిలిచినా ఆ సినిమాలో నేను నటించలేదు అన్నారు.

44

రజినీ సినిమాలో విలన్ గా నటిస్తే చాలా అవకాశాలు వస్తాయి. కానీ, విలన్ పాత్రలలో ఇరుక్కుపోతానేమో అన్న ఆలోచన వచ్చింది. అందుకే ఆ సినిమాలో నటించలేదు  అని సత్యరాజ్ అన్నారు. బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రలో నటించి భారతదేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు సత్యరాజ్.ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా గుర్తుండిపోయారు. తెలుగులో వరుస అవకాశాలు కూడా సత్యరాజ్ కు వచ్చాయి. 

Read more Photos on
click me!

Recommended Stories