డిసెంబర్ 2025 రెండో వారంలో 11 నుంచి 13వ తేదీ మధ్య బాలీవుడ్, సౌత్ కలిపి 6 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో బాలయ్య బాబు అఖండా 2తో పాటు ది డెవిల్, షోలే : ది ఫైనల్ కట్, 'మోగ్లీ' లాంటి రిలీజ్ అయ్యాయి. మరి వాటి కలెక్షన్ల మాట ఏంటి?
నందమూరి నట సింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో నటించిన నాలుగో సినిమా అఖండ 2. ఈసినిమా భారీ అంచనాల నడుమ డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. వారం రోజుల్లో ఈసినిమా ఇండియాలో 76.64 కోట్లు వసూలు చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా అఖండ2 102 కోట్ల వరకూ రాబట్టింది. ఒక రకంగా ఈసినిమాపై ఉన్న అంచనాలకు ఈ కలెక్షన్లు తక్కువనే చెప్పాలి. మరి టోటల్ రన్ లో ఎంత వసూలు చేస్తుందో చూడాలి.
26
మోగ్లీ
బాలయ్య సినిమా రిలీజ్ కు ఎదరెళ్లిన చిన్న సినిమా మోగ్లీ. స్టార్ యాంకర్ సుమ, టాలీవుడ్ నడుటు రాజీవ్ కనకాల తనయుడు యంగ్ హీరో రోషన్ కనకాల, సాక్షి మహదోల్కర్ జంటగా నటించిన ఈసినిమాకు సందీప్ రాజ్ దర్శకుడు. యాక్షన్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ వీక్ 2.45 కోట్లు కలెక్ట్ చేసింది.
36
కిస్ కిస్ కో ప్యార్ కరూన్ 2 (హిందీ)
బాలీవుడ్ స్టార్ నటుడు కపిల్ శర్మ, మనజోత్ సింగ్ జంటగా నటించిన ఈసినిమా రొమాంటిక్-కామెడీ జానర్ లో రూపొందింది. డిసెంబర్ 12 రిలీజ్ అయిన ఈసినిమా ఫస్ట్ వీక్ లో 10.85 కోట్ల వరకూ కలెక్షన్స్ ను రాబట్టింది.
కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీప్, రచనా రాయ్ జంటగా నటించిన సినిమా ది డెవిల్. ప్రకాష్ వీర్ డైరెక్ట్ చేసిన ఈసినిమా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది. ఈసినిమా ఫస్ట్ వీక్ దాదాపు గా 25.11 కోట్ల వసూళ్లు సాధించింది.
56
మహాస్నేహ (తమిళం)
యంగ్ స్టార్స్ విమల్, సృష్టి డాంగే జంటగా.. కమెడియన్ యోగి బాబు ప్రముఖ పాత్రలో నటించిన సినిమా మహాస్నేహ. దినేష్ కలైసెల్వన్ డైరెక్టర్ గా .. మైథలాజికల్ థ్రిల్లర్. గా రిలీజ్ అయిన ఈసినిమా వారంరోజులకు గాను 1.26 కోట్లు సంపాదించింది.
66
షోలే : ది ఫైనల్ కట్ (హిందీ- రీ-రిలీజ్)
ఒకప్పటి స్టార్ హీరోలు ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, అమ్జద్ ఖాన్ లు నటించిన భారీ బ్లాక్ బస్టర్ సినిమా షోలే. రమేష్ సిప్పీ డైరెక్ట్ చేసిన ఈసినిమా రీరిలీజ్ లో కూడా ఫస్ట్ వీక్ 1.98 కోట్లు వసూలు చేసి చూపించింది.