మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు

Published : Dec 19, 2025, 12:22 PM IST

టాప్ 5 లోకి చేరుకోలేకపోయిన భరణి ఓ ఇంటర్వ్యూలో విన్నర్ రేసులో ఉన్న కంటెస్టెంట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడో వారంలోనే ఎలిమినేట్ కావలసిన వ్యక్తి ఎలా విన్నర్ రేసులో నిలిచాడో వివరించారు. 

PREV
15
బిగ్ బాస్ తెలుగు 9

బిగ్ బాస్ తెలుగు 9 రసవత్తర ఫినాలేకి రెడీ అవుతోంది. డిసెంబర్ 21న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. ప్రస్తుతం హౌస్ లో తనూజ, సంజన, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, కళ్యాణ్ పడాల టాప్ 5 సభ్యులుగా ఉన్నారు. విన్నర్ రేసులో తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ ఉన్నట్లు తెలుస్తోంది. విజేత ఎవరనేది మాత్రం చివరి వరకు సస్పెన్స్ అనే చెప్పాలి. కానీ తనూజ అభిమానులు, కళ్యాణ్ అభిమానులు ఎవరికీ వారు తమ ఫేవరేట్ కంటెస్టెంటే విజేత అని అంటున్నారు. 

25
టాప్ 5కి చేరుకోలేకపోయిన భరణి 

టాప్ 5లో ఉంటాడనుకున్న భరణి ఫినాలే వీక్ కి ముందు ఎలిమినేట్ అయ్యారు. భరణి హౌస్ లో ఉన్నప్పుడు దివ్య, తనూజ లతో ఎమోషనల్ బాండింగ్ పెట్టుకున్నారు. అదే అతడికి మైనస్ గా మారింది అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఎలిమినేట్ అయ్యాక కూడా భరణికి మరో ఛాన్స్ వచ్చింది. రెండవ ఛాన్స్ ని ఉపయోగించుకునేందుకు భరణి ట్రై చేశాడు. కానీ టాప్ 5లోకి వెళ్లడం సాధ్యం కాలేదు. 

35
3వ వారంలోనే ఎలిమినేట్ కావాల్సింది  

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో భరణి విన్నర్ రేసులో ఉన్న ఓ కంటెస్టెంట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. భరణి కామెంట్ చేసింది కళ్యాణ్ గురించే. భరణి మాట్లాడుతూ.. కళ్యాణ్ థర్డ్ వీక్ లోనే ఎలిమినేట్ కావాల్సింది. ప్రియా కాస్త బెటర్ గా గేమ్ ఆడి ఉన్నా కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యేవాడు. తొలి మూడు వారాల్లో కళ్యాణ్ గేమ్ నిల్. అసలు కనిపించింది లేదు. ఎలిమినేషన్ గండం నుంచి తప్పించుకున్న తర్వాత కళ్యాణ్ నాతో పర్సనల్ గా మాట్లాడాడు. గేమ్ ఎలా ఆడాలో, ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగించాలో అర్థం కావడం లేదు అని అడిగాడు. 

45
తనూజతో కళ్యాణ్ బాండింగ్ 

నేను ఒకటే సలహా ఇచ్చా. కళ్యాణ్ నీ గేమ్ నువ్వు ఆడు. ఎవరికీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వొద్దు. నన్ను కూడా పట్టించుకోవద్దు. నా స్ట్రాటజీ నాకు ఉంటుంది. అలాగే నీ స్ట్రాటజీ నీకు ఉండాలి అని చెప్పా. ఆ తర్వాత నుంచి కళ్యాణ్ గేమ్ మారింది. తనూజతో అతడికి బాండింగ్ ఏర్పడింది. అది కూడా కళ్యాణ్ కి బాగా ప్లస్ అయింది. తనూజతో కళ్యాణ్ బాండింగ్ పెట్టుకోవడం అతడి స్ట్రాటజీనా అంటే పూర్తిగా చెప్పలేం. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఒకరిపై ఒకరికి మంచి అభిప్రాయం ఉంది. 

55
బయటకి వచ్చాక తెలిసింది 

కానీ బయటకి వచ్చాక షాకింగ్ విషయం తెలిసింది. సోషల్ మీడియాలో కళ్యాణ్ గురించి బాగా మాట్లాడుకుంటున్నారు. కళ్యాణ్ వెనుక ఎవరైనా ఉన్నారా ? అది పీఆర్ స్ట్రాటజీ నా అనేది నాకు తెలియదు. మొత్తంగా కళ్యాణ్ విన్నర్ రేసులోకి వచ్చాడు అని భరణి అన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories