`ఖైదీ` సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించింది మాధవి. ఈ మూవీ కంటే ముందే ఆమె స్టార్‌గా ఎదిగింది. కానీ కమర్షియల్‌గా బిగ్ బ్రేక్‌ని, ఆమె కెరీర్‌ని మరో స్థాయికి తీసుకెళ్లిన మూవీ ఇదే కావడం విశేషం. చిరు, రాధాల జోడీ కంటే ముందే చిరంజీవి, మాధవి ల కాంబినేషన్ చాలా పాపులర్. వీరిద్దరి కాంబినేషన్‌లో `ప్రాణం ఖరీదు`, `మనవూరిపాండవులు`, `కుక్క కాటుకు చెప్పు దెబ్బ`, `కోతల రాయుడు`, `అగ్ని సంస్కారం`, `ఊరికి ఇచ్చిన మాట`, `ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య`, `రోషగాడు`, `సింహపూరి సింహం`, `ఖైదీ`, `చట్టంతో పోరాటం`, `దొంగమొగుడు`, `బిగ్ బాస్` వంటి చిత్రాలు వచ్చాయి. ఆమె తెలుగులో ఎక్కువగా చిరుతోనే నటించడం విశేషం. వీరితోపాటు కృష్ణ, కృష్ణంరాజులతోనూ సినిమాలు చేసి విజయాలు అందుకుంది. స్టార్ హీరోయిన్‌గా రాణించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.