Published : Nov 05, 2025, 08:56 AM ISTUpdated : Nov 05, 2025, 09:02 AM IST
Illu lllalu Pillalu today Episode: ఇల్లు ఇల్లు పిల్లలు సీరియల్ ఈరోజు బెదిరింపులు, గొడవలతో ఆసక్తికరంగా మారింది. సేనాపతి తాగి రామరాజు ఇంటి మీదకు వస్తాడు. అందరికీ వార్నింగ్ ఇస్తాడు. ఇక ఈ ఎపిసోడ్లో ఇంకేం జరిగిందో తెలుసుకోండి.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ లో భద్రావతి, సేనాపతులకు చెందిన ఇల్లీగల్ ఆస్తులు అన్నింటినీ నర్మదా జప్తు చేస్తుంది. దీంతో వారు ఇద్దరు చాలా కోపంగా ఉంటారు. మీ మామయ్య చెప్పడం వల్లే నువ్వు ఇలా చేస్తున్నావ్ అంటూ నర్మదా మీదకు సేనాపతి వస్తాడు. వెంటనే పోలీసులు అతడిని అడ్డుకుంటారు. మీ మామని చూసే కదా రెచ్చిపోతున్నావ్ నిన్ను వదలనే అంటూ సేనాపతి అరుస్తాడు. దాంతో పోలీసులు అతని దూరంగా తీసుకెళ్తారు. భద్రావతి నర్మదని కోపంగా చూస్తూ నిలబడిపోతుంది.
ఇక్కడ నుంచి సీన్ ఇడ్లీ బాబాయ్ ఇంటికి మారిపోతుంది. ఇడ్లీ బాబాయి, భాగ్యం నిద్రపోతూ ఉండగా శ్రీవల్లి వచ్చి తలుపు కొడుతుంది. వారు తలుపు తీసేసరికి శ్రీవల్లి చేతిలో పూలదండలు కనిపిస్తాయి. అదేంటని అడిగితే నాకు పెళ్లి చేశారు కదా అందుకే సన్మానం చేద్దామని వచ్చా అని చెబుతుంది శ్రీవల్లి. తల్లిదండ్రులు ఇద్దరికీ దండలేస్తుంది. అలా దండలు వేసాక నాకు రాయబారం బాధ్యతలు అప్పగించారు.. ఆ బండోడు పూటకోసారి అమూల్యని తీసుకురా అంటూ నన్ను చంపుతున్నాడు. నేను ఆ బండోడితో మాట్లాడుతున్నట్టు మా ఇంట్లో ఎవరైనా చూస్తే నన్ను చంపేస్తారు అంటూ శ్రీవల్లి అమ్మానాన్నలపై సీరియస్ అవుతుంది.
25
సేనాపతి గొడవ
ఇక అర్ధరాత్రి సేనాపతి ఫుల్లుగా తాగేసి రామరాజు ఇంటి మీదకి వస్తాడు. బయట నిల్చుని ‘రామరాజు బయటికి రారా’ అంటూ అరుస్తాడు. వేదవతి కోడళ్లు, కూతురు బయటకు వచ్చి చూస్తారు. తర్వాత కొడుకులు కూడా వస్తారు. రామరాజు మాత్రం బయటికి రాడు. దీంతో సేనాపతి ‘వాడిని బయటకి రమ్మని చెప్పండ్రా’ అని అరుస్తాడు. అప్పుడు ధీరజ్, సాగర్, చందు సీరియస్ గా గొడవకు పెళ్ళేందుకు సిద్ధమవుతారు. అప్పుడు వేదవతి వారిని ఆపేస్తుంది.
35
రామరాజు ఇంట్లో లేకపోవడంతో
మీ నాన్న ఇంట్లో లేనప్పుడు గొడవలు జరిగితే ఆయన తట్టుకోలేరు అని కొడుకులకు చెబుతుంది వేదవతి. సేనాపతి మాత్రం తాగి నోటికి వచ్చిందల్లా వాగుతూ ఉంటాడు. రామరాజు గాజులు తొడుక్కుని ఇంట్లో కూర్చున్నాడా అంటూ అరుస్తాడు. వేదవతి కొడుకుల్ని, కోడళ్ళని ఇంట్లో పెట్టి గేటు వేసి తాను మాత్రమే బయటికి వస్తుంది. ఎవరినీ బయటికి రావద్దని చెబుతుంది. సేనాపతితో ‘మేము మీ జోలికి రాలేదు. తాగి మా ఇంటి మీద ఎందుకు గొడవకు వస్తున్నావు .. నీకు పని పాట లేదా’ అని అడుగుతుంది. అప్పుడు సేనాపతి మరి మీ రెండో కోడలితో మా ప్రాపర్టీని జప్తు ఎందుకు చేయించారని ప్రశ్నిస్తాడు. దీంతో అందరూ నర్మదని చూస్తూ షాక్ అవుతారు. అప్పుడు నర్మదా బయటికి వచ్చి ‘మీరు ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేశారు.. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కాబట్టి సబ్ రిజిస్టర్ గా నేను నా పని చేశాను. అది పూర్తిగా నా డ్యూటీ. మీకు ఏమైనా మాట్లాడాల్సి వస్తుంటే ఆఫీస్ కి వచ్చి కలవండి.. అంతే తప్ప ఇలా ఇంటికి వచ్చి గొడవ చేయకండి’ అని చెబుతుంది.
అప్పుడు సేనాపతి ఆ కూలోడు రామరాజు డైరెక్ట్ గా నాతో పెట్టుకోలేకే నీ ఉద్యోగం అడ్డుపెట్టుకొని ఆడుతున్నాడు అని తిడతాడు. రామరాజుని సిగ్గులేనివాడు అని పిలుస్తాడు. దీంతో నర్మదకి కోపం వస్తుంది. మామయ్య గారికి ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదు అని చెబుతుంది. అయినా కూడా సేనాపతి వినకుండా నా చెల్లిని మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు, వాడి కొడుకు నా కూతుర్ని తీసుకెళ్లాడు.. వాడిని వదిలిపెట్టను, అలాగే నిన్ను కూడా వదిలిపెట్టను అంటూ నర్మదకి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు.
55
సేనాపతి కూతురిని తిట్టిన ధీరజ్
సేనాపతి కూతురైన ప్రేమను తిడుతాడు ధీరజ్. మీ నాన్నకు బుద్ధి ఉందా? ఇలా ఆడవాళ్ళ మీదకు గొడవకు రావచ్చా అంటాడు. ప్రేమ వదిలేయమని చెప్పినా ధీరజ్ ఊరుకోడు. మీ వాళ్ళని వెనకేసుకుని వస్తావని మళ్లీ తిడతాడు. మీ వైపు తప్పు పెట్టుకొని ఎదుటి వాళ్ళ మీదకు వెళ్లడం మీ రక్తంలోనే ఉంది కదా అని అంటాడు. దాంతో ప్రేమకు చాలా కోపం వస్తుంది. ధీరజ్ చెయ్యి కొరికేస్తుంది. దీంతో ధీరజ్ అరిచి గొడవపడతాడు. కానీ ప్రేమ ఏమాత్రం తగ్గకుండా దెబ్బలేస్తుంది. దీనికి దూరంగా ఉంటే మంచిది అనుకుని వెళ్ళిపోతాడు ధీరజ్. వేదవతి … సేనాపతి చేసిన గొడవను తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. దీంతో ఎపిసోడ్ ముగిసిపోతుంది