శోభన్‌ బాబుకి ఇష్టమైన కార్‌ బ్రాండ్‌ ఇదే.. రాయల్‌ లైఫ్‌కి కేరాఫ్‌, కానీ ఎప్పుడూ ఈ పనిచేయలేదట

Published : Nov 05, 2025, 09:29 AM IST

సోగ్గాడు శోభన్‌ బాబు సిస్టమాటిక్‌ లైఫ్‌కి కేరాఫ్‌. అదే సమయంలో రాయల్‌ లైఫ్‌కి కూడా ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌గా చెప్పొచ్చు. మరి సోగ్గాడికి ఇష్టమైన కార్‌ ఏంటో తెలుసా? 

PREV
15
వారసత్వాన్ని సినిమాలకు దూరం పెట్టిన శోభన్‌ బాబు

శోభన్‌ బాబు తెలుగు సినిమాల్లో ఒక లెజెండరీ నటుడు. తిరుగులేని సూపర్‌ స్టార్‌. అన్నింటికి మించి తెలుగు జాతి అందగాడు. తెలుగు హీరో అయినా, తమిళంలో విశేష ప్రేక్షకాదరణ పొందిన నటుడు సోగ్గాడు కావడం విశేషం. సినిమాల్లో ఒక్క హీరో ఉంటే వారి వారసులు రెండు మూడు తరాలుగా వస్తూనే ఉంటారు. ఎన్టీఆర్‌ ఫ్యామిలీ నుంచి మనవళ్లు, మునిమనవళ్లు కూడా వస్తున్నారు. ఏఎన్నార్‌ ఫ్యామిలీ నుంచి మనవళ్లు వచ్చారు. కృష్ణ ఫ్యామిలీ నుంచి మనవళ్లు వస్తున్నారు. చిరంజీవి వారసత్వం కూడా నడుస్తోంది. కానీ శోభన్‌ బాబు మాత్రం తన ఫ్యామిలీ నుంచి ఒక్కరిని కూడా సినిమాల్లోకి తీసుకురాలేదు.

25
శోభన్‌ బాబు వారసులను సినిమాల్లోకి తీసుకురాకపోవడానికి కారణమిదే

సినిమాల్లో తనలాగా తన పిల్లలు కష్టపడవద్దని, ఈ ఇబ్బందులు పడొద్దని శోభన్‌ బాబు భావించారు. అందుకే తన పిల్లలను సినిమాల్లోకి తీసుకొచ్చేందుకు చాలా మంది ప్రయత్నించినా, తన వారసులు కూడా ఆసక్తి చూపించిన ఆదిలోనే కట్‌ చేశారు శోభన్‌ బాబు. తాను చాలా సంపాదించాను. వాటిని చూసుకుని హ్యాపీగా ఉండాలని,సంతోషమైన జీవితం గడపాలని సోగ్గాడు కోరుకున్నారు. అందుకే వారసత్వాన్ని తీసుకురాలేదు. చాలా ఏళ్ల వరకు శోభన్‌ బాబు ఫ్యామిలీ ఎవరు? ఏం చేస్తున్నారనేది ఎవరికీ తెలియదు. అయితే ఇటీవల ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. శోభన్‌ బాబు కొడుకు, మనవళ్లు పలు ఇంటర్వ్యూస్‌ ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. దీంతో సోగ్గాడి గురించిన చర్చ నడుస్తోంది.

35
ఆఫర్లు వచ్చాయి, కానీ ఆదిలోనే కట్‌ చేశారు

ఈ క్రమంలో లేటెస్ట్ గా శోభన్‌ బాబు కూతురు కొడుకు డాక్టర్ సురక్షిత్‌ మీడియా ముందుకు వచ్చారు. సుమన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాము సినిమాల్లోకి రావడం తాతగారికి ఇష్టం లేదని, చాలా ప్రపోజల్స్ వచ్చాయని, కానీ ప్రారంభంలోనే కట్‌ చేసేవారని తెలిపారు. దీంతో తాము కూడా ఆ దిశగా ఫోకస్‌ చేయలేదన్నారు. డాక్టర్‌గా రాణిస్తున్న ఆయన శోభన్‌ బాబుకి సంబంధించి మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. సోగ్గాడికి ఇష్టమైన విషయం ఒకటి వెల్లడించారు. ఆయనకు కార్లంటే చాలా ఇష్టమట.

45
శోభన్‌ బాబుకి ఇష్టమైన కార్

`తాతగారికి కార్లు చాలా ఇష్టం. ప్రారంభంలో ఆయన అంబాసిడర్‌ వాడేవారు. కానీ ఇష్టమైన కారు మెర్సిడేజ్‌ బెంజ్‌` అని తెలిపారు. తాను బాగా ఎదిగిన తర్వాత ఒక మెర్సిడేజ్‌ బెంజ్‌ కొన్నారని, దాన్ని బాగా చూసుకున్నారని తెలిపారు. అదే సమయంలో మరో ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని రివీల్‌ చేశారు సురక్షిత్‌. శోభన్‌ బాబు ఎప్పుడూ డ్రైవ్‌ చేయలేదట. ఇష్టంగా మెర్సిడేజ్‌ బెంజ్‌ కారు కొన్నారు, కానీ ఆయన ఎప్పుడూ డ్రైవ్‌ చేయలేదని తెలిపారు. డ్రైవర్ ఉండేవారని తెలిపారు. ఇప్పుడు ఆయా కార్లని చెన్నైలోని శోభన్‌ బాబు ఇంట్లో భద్రపరిచారట. ఆ ఇంటిని మ్యూజియంగా మార్చి ఆయన వాడిన కార్లు, వాచ్‌లు, ఇతర వస్తువులను షోకేస్లా ప్రదర్శించారని తెలిపారు. అంతేకాదు ఆయన ఏది వాడినా బ్రాండ్‌ మెయింటేన్ చేసేవారని, రాయల్‌ లైఫ్‌ని అనుభవించారని తెలిపారు సురక్షిత్‌. 

55
మహిళా ప్రేక్షకులకు దగ్గరైన సోగ్గాడు

శోభన్‌ బాబు ఫ్యామిలీ చిత్రాలతో మహిళా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. విశేష ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నారు. 1959లో సినిమా కెరీర్‌ని ప్రారంభించారు. `భక్త శబరి` చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. 1996 వరకు సినిమాలు చేశారు. సుమారు 36ఏళ్లు సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. ఆ తర్వాత 60 ఏళ్లు వచ్చాక స్వతహాగా రిటైర్‌ మెంట్‌ని ప్రకటించారు. ప్రజల మనసులో తన రూపం సోగ్గాడిగానే ఉండిపోవాలని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఎంతో మంది ఆయన్ని సంప్రదించినా సినిమాలు చేయలేదు. చివరికి 2008 మార్చి 20న గుండెపోటుతో కన్నుమూశారు సోగ్గాడు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories