డైరెక్టర్ వివి వినాయక్ తన కెరీర్ లో రిగ్రెట్ గా ఫీల్ అయ్యే సినిమాల గురించి కామెంట్స్ చేశారు. ఓ యువ హీరో తప్పకుండా భవిష్యత్తులో సూపర్ స్టార్ అవుతాడని అన్నారు.
మాస్ చిత్రాలు హిట్ అయితే ఆ ప్రభావం చాలా ఉంటుంది. కలెక్షన్స్ భారీగా ఉంటాయి. హీరోల ఇమేజ్ అమాంతం పెరుగుతుంది. సరైన కథతో మాస్ సినిమా చేయాలని ప్రతి హీరో కోరుకుంటారు. హీరోలు కోరుకునే మాస్ సినిమాలు డెలివరీ చేయడంలో డైరెక్టర్ వివి వినాయక్ సిద్ధహస్తులు. జూనియర్ ఎన్టీఆర్ కి మాస్ ఇమేజ్ మొదలైంది వివి వినాయక్ తెరకెక్కించిన ఆది చిత్రంతోనే.
25
ఆ సినిమా వల్ల ప్రతి రోజూ బాధే
వివి వినాయక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అఖిల్ అక్కినేని అఖిల్ సినిమా విషయంలో తాను ప్రతి రోజూ బాధపడుతూనే ఉంటా అని వివి వినాయక్ అన్నారు. నాగార్జున గారు ఎంతో ఇష్టపడి, నమ్మి నాకు అఖిల్ ని పరిచయం చేసే ఛాన్స్ ఇచ్చారు. అఖిల్ ఎంతో ఇష్టపడి, ప్రేమతో నా దర్శకత్వంలో నటించాడు. అలాంటి హీరోకి హిట్ ఇవ్వలేకపోయాను అనే బాధ నాకు ప్రతి రోజూ ఉంటుంది. నా కెరీర్ లో ఇదే రిగ్రెట్ అని వినాయక్ అన్నారు.
35
రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేశా
అఖిల్ కొత్తగా వచ్చిన కుర్రాడు. అతడిపై బరువు ఎక్కువ ఉన్న కథని పెట్టేశాం. ఆ కథని ఎంచుకోవడమే మేము చేసిన తప్పు. ఆ సినిమాతో నష్టపోయిన బయ్యర్లకి ఆదుకునేందుకు నా రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేశా అని వినాయక్ రివీల్ చేశారు. కానీ ఏదో ఒక రోజు అఖిల్ కచ్చితంగా సూపర్ స్టార్ అవుతాడు అని వినాయక్ అన్నారు.
తన కెరీర్ లో భారీ అంచనాలు పెట్టుకుని నిరాశ పరిచిన చిత్రం అంటే చెన్నకేశవరెడ్డి అని వివి వినాయక్ అన్నారు.అసలు చెన్నకేశవరెడ్డి అప్పటి వరకు ఉన్న సినిమాలని అధికమించి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తుంది అని అనుకున్నాం. కానీ ఆ సినిమా వర్కౌట్ కాలేదు అని వినాయక్ అన్నారు.
55
వివి వినాయక్ సినిమాలు
వివి వినాయక్ తన కెరీర్ లో ఆది, ఠాగూర్, దిల్, లక్ష్మీ, కృష్ణ, అదుర్స్, నాయక్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించారు. ఇటీవల వినాయక్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు.