శర్వానంద్ నటించిన భోగి చిత్రానికి నెగిటివ్ రివ్యూలు, దారుణమైన మౌత్ టాక్ తొలి రోజే ప్రారంభం అయ్యాయి. ఆ ప్రభావం ఫస్ట్ డే కలెక్షన్స్ పై పడింది. తొలిరోజు కలెక్షన్స్ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
భోగి సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రారంభం కాలేదు. విడుదలైన మొదటి రోజే ఈ చిత్రం సాధారణ వసూళ్లతో సరిపెట్టుకుంది. ఇండియాలో తొలి రోజు 2,064 షోల ద్వారా రూ.1.90 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. దేశీయంగా ఈ సినిమా గ్రాస్ వసూళ్లు రూ.2.18 కోట్లుగా నమోదయ్యాయి. భారీ సంఖ్యలో షోలు ప్రదర్శించినప్పటికీ, వాటికి తగ్గట్టుగా ఓపెనింగ్ కలెక్షన్లు మాత్రం రాలేదు.
24
ఓవర్సీస్లోనూ అంతంతమాత్రంగానే
దేశీయ బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా మొదలైన భోగి సినిమా, ఓవర్సీస్లోనూ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. విదేశాల్లో ఈ చిత్రం కేవలం రూ.35 లక్షల గ్రాస్ వసూళ్లు మాత్రమే సాధించింది. దీంతో భారత్, ఓవర్సీస్ కలిపి ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.2.53 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఓపెనింగ్ రోజున ఈ స్థాయి వసూళ్లు నమోదు కావడంతో సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఆరంభం దక్కలేదని తెలుస్తోంది.
34
భోగికి ప్రతికూలంగా రివ్యూలు
ఓపెనింగ్ కలెక్షన్లు తక్కువగా ఉండటంతో పాటు భోగి సినిమాకు మరో సమస్య ఎదురైంది. ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ఎక్కువగా ప్రతికూల సమీక్షలు వచ్చాయి. సాధారణంగా సినిమా విడుదలైన తొలి రోజు వసూళ్లు తక్కువగా ఉన్నా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తే వారాంతంలో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ భోగికి ఎక్కువగా నెగిటివ్ రివ్యూలు రావడం బాక్సాఫీస్ వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
తొలి రోజు బలహీనమైన వసూళ్లు, ప్రతికూల సమీక్షలతో భోగి సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టి సవాలును ఎదుర్కొంటోంది. వారాంతంలో కలెక్షన్లు పెరగాలంటే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం నమోదైన వసూళ్లను బట్టి చూస్తే సినిమా ముందుకు సాగడం అంత సులభంగా కనిపించడం లేదు. ఈ సినిమా టాక్, నమోదవుతున్న కలెక్షన్స్ చూస్తుంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఆమడ దూరంలో నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి 15 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 16 కోట్ల వరకు షేర్ సాధించాలి. గ్రాస్ పరంగా చూస్తే 30 కోట్ల వరకు ఉంటుంది. తొలి రోజు 2.53 కోట్ల గ్రాస్ మాత్రమే ఈ చిత్రం రాబట్టింది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. భోగి పరిస్థితి ఎలా ఉందో అని.