నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి చెన్నైలో 48 ఏళ్ళ క్రితం తనకు ఎదురైన సంఘటనని గుర్తు చేసుకున్నారు. తాను మెగాస్టార్ అయ్యేందుకు పునాది పునాది వేసిన ఆ సంఘటన గురించి ఈ కథనంలో తెలుసుకోండి.
మెగాస్టార్ చిరంజీవి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. మెగాస్టార్ గా ఎదిగి నెంబర్ 1 హీరోగా టాలీవుడ్ ని దశాబ్దాలు ఏలారు. చిరంజీవి అంత సాధించడం వెనుక ఆయన ప్రతిభ మాత్రమే కాదు, పాటించిన క్రమశిక్షణ, విలువలు కూడా కారణం అయ్యాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్వహించిన 'నషా ముక్త్ భారత్' కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరు యువతకు సందేశం ఇస్తూ ప్రసంగించారు.
25
48 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన
మాదక ద్రవ్యాలు లాంటి చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలి అని చిరు పిలుపునిచ్చారు. ఒక అలవాటే కదా అని మొదలు పెడితే అది మరో అలవాటుకు దారి తీస్తుంది అని చిరంజీవి అన్నారు. తన కెరీర్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో చెన్నై లోని పాండి బజార్ లో జరిగిన సంఘటనని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. 48 ఏళ్ళ క్రితం చెన్నైలో ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరాను. సాయంత్రం స్నేహితులతో కలసి సరదాగా పాండి బజార్ కు వెళ్ళేవాళ్ళం. సినిమాల్లో పనిచేస్తున్న వారు, అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారంతా పాండి బజార్ కు వచ్చేవారు.
35
ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్
నేను సరాదాగా టీ తాగుదామని మాత్రమే వెళ్ళాను. అక్కడున్న వాళ్ళు ఎవరు ఈ అబ్బాయి అని అడిగారు. యాక్టర్ అవుదామని ఫిలిం ఇన్స్టిట్యూట్ లో కొత్తగా జాయిన్ అయ్యాడు అని నా ఫ్రెండ్ చెప్పారు. ఆ వాతావరణం నాకు కొత్తగా అనిపించింది. బిత్తర బిత్తరగా చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావ్.. సరదాగా చిల్ అవ్వు.. రేయ్ మనోడికి బీర్ తీసుకురండిరా అని చెప్పారు. లేదండీ నాకు అలవాటు లేదు.. నేను తాగను అని చెప్పాను. ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అయ్యా. నువ్వు పార్టీలు ఇవ్వాలి, తీసుకోవాలి, అన్నీ అలవాటు చేసుకోవాలి.. పరిచయాలు పెంచుకోవాలి.. అప్పుడే అవకాశాలు వస్తాయి అని అన్నారు.
లేదండీ నేను ఆంజనేయ స్వామి భక్తుడిని.. అలాంటి పనులు చేయను అని అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాను. అలాంటి చోటుకు వెళ్లడం, ఒక్క అలవాటే కదా అని మొదలు పెట్టడం వల్ల అది మరో అలవాటుకు దారి తీస్తుంది అని ఓ పెద్ద మనిషి నాకు చెప్పారు. ఆ తర్వాత నేను పాండీబజార్ వైపే వెళ్ళలేదు. నా ద్రుష్టి మొత్తం నా లక్ష్యం పైనే ఉంచాను. ఇలా మీ ముందు మెగాస్టార్ గా నిలబడ్డాను అని చిరు సందేశం ఇచ్చారు.
55
సంక్రాంతి రేసులో మెగాస్టార్ సినిమాలు
చిరంజీవి ప్రస్తుతం కాకా చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా విశ్వంభర మూవీ కూడా చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు సంక్రాంతి రేస్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక సినిమా సంక్రాంతికి వస్తే మరో మూవీ వాయిదా పడక తప్పదు .