నన్ను క్యారెక్టర్ లేని మనిషి అని అంటుంటే హౌస్ లో ఒక్కరు కూడా మాట్లాడలేదు అంటూ ముకేశ్ వద్ద వర్షిణి ఏడ్చేసింది. ఆ తర్వాత అంతా కూల్ అయ్యాక కెప్టెన్సీ పోటీకి చివరి కంటెండర్ కోసం రామ్ ప్రసాద్, ముకేశ్, త్రిగుణ్ , వంశీ మధ్య టాస్క్ జరిగింది. ఈ టాస్క్ లో రామ్ ప్రసాద్ విజయం సాధించాడు. ఇక ఫైనల్ గా కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఈ టాస్క్ లో కంటెండర్స్ గా ఆర్కే, రామ్ ప్రసాద్, సుధీర్, నరేష్, శివ కుమార్, దేబ్జానీ, అమన్ పాల్గొన్నారు. ఒక్కో రౌండ్ ముగిసే సరికి ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతుంటారు. చివరికి దేబ్జానీ, ఆర్కే మిగిలారు. మిగిలిన సభ్యులు చివర్లో దేబ్జానీకి సపోర్ట్ చేయడం తో ఆమె విజయం సాధించింది. దీనితో దేబ్జానీ చివరి కెప్టెన్ గా అవకాశం సాధించింది.